Hyderabad: ఇక మార్పు వచ్చేది ఎన్నడు..?.. మూడో సారీ ఆడపిల్లే.. తండ్రి షాకింగ్ డెసిషన్

|

Feb 21, 2023 | 9:54 AM

ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. మగవాళ్లతో సమానంగా పోటీ పడుతున్నారు. కానీ.. ఎంత చేసినా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే..

Hyderabad: ఇక మార్పు వచ్చేది ఎన్నడు..?.. మూడో సారీ ఆడపిల్లే.. తండ్రి షాకింగ్ డెసిషన్
Child
Follow us on

ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. మగవాళ్లతో సమానంగా పోటీ పడుతున్నారు. కానీ.. ఎంత చేసినా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. మారుమూల ప్రాంతాల్లో అనుకుంటే పొరపాటే. హైదరాబాద్ మహానగరంలోనూ ఇలాంటి పరిస్థితే ఉండటం ఆవేదన కలిగిస్తోంది. ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తున్న వారు ఎక్కువయిపోతున్నారు. తాజాగా రాజేంద్రనగర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. మూడో సారి కూడా ఆడపిల్లే పుట్టడంతో ఆ తండ్రి తీసుకున్న డెసిషన్ అందరినీ షాక్ కు గురి చేసింది.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని సులేమాన్‌నగర్‌ ప్రాంతంతో మహ్మద్‌ అహ్మద్‌ నివాసముంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అహ్మద్ పర్నిచర్‌ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య మరోసారి గర్భం దాల్చి.. నెలలు నిండడంతో ప్రసవం కోసం కర్ణాటకలో ఉన్న ఆమె పుట్టింటికి పంపించాడు. కాగా.. ఆమెకు మూడో సారి కూడా ఆడపిల్లే జన్మించింది. దీంతో అహ్మద్‌ కొన్ని రోజులుగా మనోవేదనకు గురయ్యాడు.

తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం