
ఆర్టీసీ ప్రయాణికులు బిగ్ షాక్ తగిలింది.. వరుస పండగల సెలవుల నేపథ్యంలో TGSRTC బస్సు చార్జీలు భారీగా పెంచినట్టు తెలుస్తోంది. సాధారణ రోజులతో పోల్చుతే ప్రస్తుతం స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది ఆర్టీసీ. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం, కరీంనగర్, సత్తుపల్లికి వెళ్లే స్పెషల్ బస్సుల్లో ఈ చార్జీలు అమల్లో ఉండనున్నట్టు ఆర్టీసీ పేర్కొంది. అలాగే డీలక్స్, సూపర్‌లగ్జరీ, రాజధాని బస్సుల్లో.. ఏసీ, ఆర్ నాన్ ఏసీ.. సర్వీస్‌ను బట్టి ఛార్జీలను వసూలు చేస్తోంది ఆర్టీసీ.
ప్రస్తుతం పండుగ సీజన్‌లో నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోన్నట్టు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సర్వీసుల్లో ఛార్జీలను సవరిస్తున్నట్టు ఆర్టీసీ పేర్కొంది. 2003లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (GO Ms. No. 16) ప్రకారం, ఈ సర్వీసుల ఛార్జీలను సవరించినట్టు పేర్కొంది. పండుగ సమయాల్లో నడిపే ప్రత్యేక బస్సులకు సాధారణ ఛార్జీల కంటే గరిష్టంగా 50 శాతం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ఈ జీవోలో స్పష్టం చేసింది.
RTC తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ రోజుల్లా కాకుండా పండుగల సీజన్‌లో నడిపే ప్రత్యేక బస్సులు.. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన తర్వాత.. తిరిగి ఖాళీగా రావాల్సి ఉంటుందని.. దీని వల్ల నిర్వహణ వ్యయంతో పాటు ఇందన వ్యయం భారీగా పెరుగుందని.. అందుకే వాటిని భర్తీ చేసేందుకు ప్రత్యేక సర్వీసుల్లో అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నట్టు ఆర్టీసీ తెలిపింది.
అయితే సాధారణ రోజుల్లో ఈ ధరలు మళ్లీ నార్మల్ స్టేజ్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కేవలం ప్రత్యేక సర్వీసుల్లో మాత్రమే ఈ అదనపు ధరలు ఉంటాయని సమాచారం. కాబట్టి ప్రయాణికులు ఇందుకు సహకరించాలని ఆర్టీసీ కోరింది.
తాజాగా పెరిగిన బస్సుల రేట్లును ఇక్కడ చూడండి..
| మార్గం | సర్వీస్ | రెగ్యులర్ ఛార్జీ | పెంచిన ఛార్జీ |
| హైదరాబాద్ – విజయవాడ | సూపర్ లగ్జరీ | రూ. 440 | రూ. 660 |
| హైదరాబాద్ – విజయవాడ | రాజధాని ఏసీ | రూ. 533 | రూ. 801 |
| హైదరాబాద్ – ఖమ్మం | సూపర్ లగ్జరీ | రూ. 320 | రూ. 480 |
| హైదరాబాద్ – సత్తుపల్లి | రాజధాని | రూ. 550 | రూ. 826 |
| హైదరాబాద్ – సత్తుపల్లి | సూపర్ లగ్జరీ | రూ. 459 | రూ. 679 |
| హైదరాబాద్ – కరీంనగర్ | సూపర్ లగ్జరీ | రూ. 260 | రూ. 389 |
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.