AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం కొనాలనుకుంటున్నారా..? వారం రోజుల్లో ఎంత తగ్గిందంటే..?

బంగారం ధరలు గత వారంలో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత మూడు వారాలుగా గోల్డ్ రేట్లు తగ్గుతూ వస్తోన్నాయి. ఈ వారంలో కూడా స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంతో బంగారం ధరల్లో మార్పులు జరుగుతున్నాయి. ఈ వారంలో ఎలా ఉన్నాయంటే..

Venkatrao Lella
|

Updated on: Sep 13, 2026 | 11:31 AM

Share
బంగారం ధరల్లో భారీ కదలికలు నమోదువుతున్నాయి. ఒక రోజు తగ్గుతుండగా.. తర్వాతి రోజు పెరుగుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, డాలర్ బలపడుతున్న క్రమంలో పసిడి ధరలు ఊహకందని రీతిలో మార్పులు లోనవుతున్నాయి. దీంతో ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో తెలియక కొనుగోలు చేయాలనుకునేవారు గందరగోళానికి గురవుతున్నారు.

1 / 5
ఈ వారం గోల్డ్ రేట్లు తారుమారయ్యాయి. ఊహించని విధంగా మార్పులు జరిగాయి. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గోల్డ్ రేట్లు ఒడిదొడుకులకు లోనయ్యాయి.  ఈ వారం మొత్తం మీద చూస్తే ధరలు స్వల్పంగా తగ్గాయి.  వారం రోజుల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? ఏయే నగరాల్లో ఎలా మారాయి? అనే విషయాలు తెలుసుకుందాం.

2 / 5
సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,800 వద్ద ప్రారంభమవ్వగా.. సెప్టెంబర్ 12 నాటికి రూ.1,54,580కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల రేటు సెప్టెంబర్ 6న రూ.1,41,900 వద్ద ప్రారంభమవ్వగా.. శనివారం నాటికి రూ.1,41,700కి చేరుకున్నాయి. వారంలో స్వల్పంగా తగ్గాయని చెప్పవచ్చు.

3 / 5
చెన్నైలో సెప్టెంబర్ 6న 24 క్యారెట్ల ధర రూ.1,54,800గా ఉండగా.. సెప్టెంబర్ 12న రూ.1,54,580కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,41,900గా ఉండగా.. శనివారం నాటికి రూ.1,41,700కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,950 వద్ద ప్రారంభమవ్వగా.. 12వ తేదీ నాటికి రూ.1,54,730కి చేరుకుంది.

4 / 5
దేశ రాజధాని ఢిల్లీలో ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,050 నుంచి రూ.1,41,850కి చేరుకుంది. గత మూడు వారాలుగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. ఆదివారం గోల్డ్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.

5 / 5
Follow Us