Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం,మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ తొమ్మిది జిల్లాల డీసీసీబీలను రద్దు చేస్తూ.. వాటి నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. సహకార సంఘాలకు గత..

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

Updated on: Dec 20, 2025 | 8:01 AM

Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సహకార రంగంలో కీలక మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) చైర్మన్లు, డైరెక్టర్లతో కూడిన పాలకవర్గాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 9 జిల్లాలకు చెందిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCB) పాలకవర్గాలను కూడా తొలగిస్తూ శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని సహకార రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.

రాష్ట్రంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం,మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ తొమ్మిది జిల్లాల డీసీసీబీలను రద్దు చేస్తూ.. వాటి నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా? తాజా రేట్ల వివరాలు!

ఇవి కూడా చదవండి

సహకార సంఘాలకు గత ప్రభుత్వం హయాంలో 2020 ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసింది. అయితే, పరిపాలనాపరమైన కారణాలతో వీరి పదవి కాలం మరో ఆరు నెలలు పొడిగించింది ప్రభుత్వం. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే పూర్తయ్యింది. అయితే ఈ 9 జిల్లాల డీసీసీబీలకు పర్సన్‌ ఇన్‌ఛార్జులుగా జిల్లా కలెక్టర్లను నియమించింది. వారు ఆరు నెలల పాటు లేదా ఎన్నికలు పూర్తయ్యే వరకు బాధ్యతలు కొనసాగిస్తారు.

ఇది కూడా చదవండి: Success Story: చదివింది 8.. చిన్న కిరాణా షాపుతో ప్రారంభించి నేడు రూ.8000 కోట్లకు.. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో నివాసం!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి