Telangana: టెన్త్ ఆన్సర్ షీట్ బండెల్ మిస్సింగ్.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ..

|

Apr 04, 2023 | 9:31 AM

మొన్న టీఎస్‌పీఎస్‌సీ కశ్వన్ పేపర్ లీక్.. నిన్న టెన్త్ కశ్చన్ పేపర్ లీక్.. నేడు టెన్త్ ఆన్సర్ షీట్స్ మిస్సింగ్.. ఈ వరుస ఘటనలు తెలంగాణను కుదిపేస్తున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో పదవ తరగతి ఆన్సర్ షీట్‌ల కట్ట మిస్ అయ్యింది.

Telangana: టెన్త్ ఆన్సర్ షీట్ బండెల్ మిస్సింగ్.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ..
Telangana Ssc Exam
Follow us on

మొన్న టీఎస్‌పీఎస్‌సీ కశ్వన్ పేపర్ లీక్.. నిన్న టెన్త్ కశ్చన్ పేపర్ లీక్.. నేడు టెన్త్ ఆన్సర్ షీట్స్ మిస్సింగ్.. ఈ వరుస ఘటనలు తెలంగాణను కుదిపేస్తున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో పదవ తరగతి ఆన్సర్ షీట్‌ల కట్ట మిస్ అయ్యింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. పోస్ట్ ఆఫీస్ నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తరలిస్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ పోస్టల్ ఆఫీసర్స్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు 20 మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. ఆ పేపర్లు ఆటోలో తరలిస్తుండగా కిందపడిపోయాయా? లేక ఎవరైనా కావాలనే చోరీ చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఆన్సర్ షీట్ మిస్సింగ్ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యమా? అంటూ విద్యాశాఖ అధికారులపై మండిపడుతున్నారు.

ఇదిలాఉంటే.. పేపర్స్ బండెల్ మిస్సింగ్‌పై విద్యాశాఖ స్పందించింది. ఉట్నూరు పదవ తరగతి జవాబు పత్రాలు మాయం అయ్యాయని ప్రకటించింది. పదిహేను మంది విద్యార్థుల తెలుగు జవాబు పత్రాలు మిస్ అయినట్లు గుర్తించామన్నారు అధికారులు. పోస్టాఫీస్‌ నుంచి బస్టాండ్‌కు తరలిస్తుండగా మిస్ అయ్యాయని, దీనికి బాధ్యులు పోస్టల్‌ అధికారులే అని అన్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..