Temperature In Telangana: పొగ మంచుతో హైవేలు డేజంర్ రోడ్స్‌గా మారిపోతున్నాయి. తెల్లవారుజామున విపరీతంగా కురుస్తున్న ఫాగ్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయి. చలి కూడా విపరీతంగా పెరిగిపోతోంది. తెలంగాణను చలి చంపేస్తుంది. వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెల్లవారుజామున మంచు దుప్పటి కప్పేయడంతో రోడ్లపైకి రావాలంటేనే జనం జంకుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక.. వాహనదారులైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. రాత్రి పూట ప్రయాణం చేసినట్లుగా.. పగలు కూడా వాహనాలకు లైట్లు వేసుకొని ప్రయాణం చేస్తున్నారు.
హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారులపై ఈ మంచు దుప్పటి విపరీతంగా కప్పేస్తుంది. ఈ పొగ మంచు చూస్తే ఈ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎలా ఉందో అర్ధమవుతోంది. అరికాళ్ళ నుండి నడి నెత్తి వరకు రక్షణ కవచాలు లేకుండా బయటికి రాని పరిస్థితి ఉందంటున్నారు. చలి తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు చలిమంటలు వేసుకొని వెచ్చదనం పొందుతున్నామంటున్నారు స్థానికులు. ఇక ముసలి, ముతక వాళ్ళ పరిస్థితి చెప్పనక్కర లేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు.
జనగాం జిల్లాలో తెల్లవారు జాము నుండి ఈ చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయి పడిపోతున్నాయి. పొగమంచుతో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి మంచు దుప్పటితో కప్పేస్తుంది. వాహనదారులు రహదారి కానరాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: