
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు..కూర్చోవటానికి సీటు సంగతి ఎలా ఉంచితే కాలు పెట్టే పరిస్థితి ఉండదు..అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డ్యూటీ చేయాలంటే కండక్టర్లు పాడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు కానీ రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్న ఆర్టీసీ డిపోగా కామారెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ మొత్తం 212 మంది కండక్టర్లుండగా.. ఇందులో 85 మంది మహిళా కండక్టర్లే కావడం విశేషం.
మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా మహిళలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం లేదు. కొంత ఆలస్యమైనా సరే ఆర్టీసీ బస్సు కోసం వేచిచూస్తు న్నారు. కొన్నిసార్లు బస్సుల్లో నిల్చునేందుకు కూడా స్థలం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో బస్సు నడిపే డ్రైవర్తో పాటు టికెట్ ఇచ్చే కం డక్టర్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిం డా ప్రయాణికులున్నా, కాలుకదిలించడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులున్నా ఓపికగా పనిచేస్తున్నారు. మహిళా కండక్టర్లు సింగిల్ క్రూ డ్యూటీలు, స్పెషల్ ఆఫ్ డ్యూటీలన్నీ చేస్తున్నారు.
కామారెడ్డి బస్ డిపో పరిధిలో మహిళా కండక్టర్లు ఎక్కువగా రద్దీ రూట్లలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఎక్కువ మంది ప్రయాణించే బాన్సువాడ, కరీంనగర్, నిజాంసాగర్, రామాయంపేట రూట్లలో రెగ్యులర్గా డ్యూటీలు చేస్తున్నారు. ఉదయం 6 గంటలలోపు డిపోనకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తెల్లవారకముందే మేల్కొని ఇల్లు, వాకిలి శుభ్రం చేసి, వంట సిద్ధం చేసి సద్దిమూట కట్టుకొని డిపోనకు చేరుకుంటారు.
85 మందిలో దాదాపు అందరూ రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలోనే డ్యూటీ చేస్తున్నారని డిపో అధికారులు చెబుతున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. సమస్యలున్నా డ్యూటీ డ్యూటీయే కదా.. మా డిపోలో ఎక్కువ మంది మహిళా కండక్టర్లు ఉం డడాన్ని గర్వంగా ఫీలవుతాం అంటున్నారు ఇక్కడ పనిచేసే మహిళా కండక్టర్లు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..