Viral Video: ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సందర్భం వింతగా ఉన్నా సరదాగా ఉన్నా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. ఆ వీడియో కనుక నెటిజన్లకు నచ్చితే.. ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తాది. తాజాగా చెంబులో తలపెట్టిన ఓ మూగజీవి.. దానిని విడిపించి సాయం చేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి.. తీరా చూస్తే అది పిల్లి కాదు పులి అని తెలిసి.. పరుగో పరుగు.. ఈ ఘటన తెలంగాణలోని చోటు చేసుకుంది. వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
మొయినా బాడ్ మండలం నక్కపల్లి రోడ్డుమీద చెంబుల్లో తల ఇరుక్కుని బాధపడుతూ రోడ్డుమీద పరుగు పెడుతున్న మూగజీవిని పని మీద అటు వెళ్తున్న వైఎస్సార్ టీపీ ఛీప్ స్పోక్ పర్సన్ కొండా రాఘవ రెడ్డి చూశారు. అది చూడడానికి పిల్లిలా ఉండడంతో.. సాయం చేసి.. చెంబు నుంచి దాని తలను తీసి విముక్తి చేద్దామని భావించిన రాఘవ రెడ్డి.. ఆ మూగజీవి దగ్గరకు వెళ్లారు. పిల్లి చెంబులో తల పెట్టిందనుకుని దాన్ని వెంబడించి రక్షించే ప్రయత్నం చేశారు. ఆ పిల్లను చేతుల్లోకి తీసుకున్నారు.. అప్పుడు రాఘవ రెడ్డికి అది పిల్లి కాదు పులి అని తెలిసింది. వెంటనే భయంతో దానిని విసిరేసి కాళ్లకు పనిచెప్పారు. అక్కడ నుంచి పరుగో పరుగు. అదే సమయంలో అక్కడ నుంచి పులి పిల్ల కూడా పరుగులు తీసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది.
మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేయండి..
Also Read: ప్రకృతి ఇచ్చిన వరం ఆకుకూరలు.. రోజూ ఏఏ ఆకుకూరలు తింటే.. ఏఏ ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..