Telangana: సాఫ్ట్‌వేర్ వద్దు.. యోగానే ముద్దు! లక్షల కొలువు వదిలి యోగా టీచర్‌గా మారిన పల్లవి..

| Edited By: Srilakshmi C

Sep 27, 2023 | 10:42 AM

బ్బు సంపాదన చుట్టూ మనిషి పరుగులు తీస్తున్నాడు. అందులోనూ.. సాప్ట్ వేర్ కొలువులు అంటే యువత లో యమా క్రేజ్.. లక్షల్లో వేతనాలు..లైఫ్ సెటిల్.. ఒకప్పటి మాట. క్రమ క్రమంగా యువత ఆలోచనా విధానం లో మార్పులు వస్తున్నాయి. డబ్బు సంపాదన తో పాటు..తమకు నచ్చిన, ఇష్టమైన రంగంలోకే వెళుతున్నారు..అలాంటి క్రేజ్ ఉన్న సాప్ట్ వేర్ కొలువు ను వదిలి.. యోగా టీచర్ గా సెటిల్ అయ్యారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన యోగా టీచర్..

Telangana: సాఫ్ట్‌వేర్ వద్దు.. యోగానే ముద్దు! లక్షల కొలువు వదిలి యోగా టీచర్‌గా మారిన పల్లవి..
Yoga Teacher
Follow us on

ఖమ్మం, సెప్టెంబర్ 27: డబ్బు సంపాదన చుట్టూ మనిషి పరుగులు తీస్తున్నాడు. అందులోనూ.. సాప్ట్ వేర్ కొలువులు అంటే యువత లో యమా క్రేజ్.. లక్షల్లో వేతనాలు..లైఫ్ సెటిల్.. ఒకప్పటి మాట. క్రమ క్రమంగా యువత ఆలోచనా విధానం లో మార్పులు వస్తున్నాయి. డబ్బు సంపాదన తో పాటు..తమకు నచ్చిన, ఇష్టమైన రంగంలోకే వెళుతున్నారు..అలాంటి క్రేజ్ ఉన్న సాప్ట్ వేర్ కొలువు ను వదిలి.. యోగా టీచర్ గా సెటిల్ అయ్యారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన యోగా టీచర్ బోయినపల్లి పల్లవి.

అందానికి, ఆభరణాలకు, డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే సమాజంలో డబ్బు కోసమే ఉద్యోగం చేస్తూ… సంపాదిస్తూ… ఆరోగ్యాన్ని పాడుచేసుకుని, సంపాదించిన డబ్బుతో ఆసుపత్రులు చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇందుకు భిన్నంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన బోయినపల్లి పల్లవి అనే సాప్ట్ వేర్ ఉద్యోగిని ఆరోగ్యమే మహాభాగ్యము గా భావించి తన ఐటీ జాబ్ కు రిజైన్ చేసి.. కోయంబత్తూరు లోని ఈశా ఫౌండేషన్ అనే ఆధ్యాత్మిక సంస్థలో 06 నెలలు హఠ యోగ లో శిక్షణ పొందారు. యోగా అనేది కేవలం శారీరిక వ్యాయామం కాదు, యోగా శరీరానికి, మనసుకి మించిన ఒక లోతైన అనుభూతని గ్రహించింది.

Yoga Teacher

యోగి, మార్మికులు, దార్శినికవేత్త అయిన సద్గురు మార్గంలో యోగా టీచర్ గా రాణిస్తూ వ్యక్తిగత, గ్రూప్ ఇంకా ఉచిత యోగా శిక్షణా తరగతులతో బిజీ బిజీ అయిపోయారు యోగా శిక్షకురాలు పల్లవి. తను తీసుకున్న యోగా శిక్షణ తో వందలాది మందికి యోగా టీచర్ గా మారింది. తమ తమ వృత్తులు, వ్యాపారాల వల్ల నిరంతరం బిజీ బిజీ గా ఉంటూ మానసిక ఒత్తిడి కి గురి కాకుండా… మన జీవనశైలి లో నిత్య యోగసాధన ద్వారా శారీరిక పటుత్వము, ఏకాగ్రత, మనశ్శాంతి పొందవచ్చు అంటున్నారు సత్తుపల్లి యువ యోగా టీచర్ పల్లవి. తాను హైదరాబాద్, ఖమ్మం జిల్లాలో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. డబ్బు,హోదా కంటే కూడా ముందు మన ఆరోగ్యం ముఖ్యమని భావించి తన ఆరోగ్యం తో పాటుగా వందలాది మందికి మంచి ఆరోగ్యం అందిచటం తో పాటు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తూ యోగాతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు యోగా టీచర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.