Telangana Weather Alert: తెలంగాణ వ్యాప్తంగా రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండలకి బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్నారు.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఏప్రిల్ మే నెలల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ఎండ కారణంగా ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళ తిప్పలు అంతా ఇంతా కాదు. ఈ ఎండలకు తిరిగితే కచ్చితంగా వడదెబ్బ తగులుతుందని, అనారోగ్యానికి గురవుతాం అని జనాలు బాధపడుతున్నారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాలు..
నిన్నటి వరకు విదర్భ నుండి ఉత్తర కేరళ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి.. ఈ రోజు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టం నుండి సుమారు 0.9కిమి ఎత్తున ఉంది. రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నారు వాతావరణ కేంద్రం అధికారులు. ఈ రోజు నుండి రాగల 5 రోజులలో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 1, 2 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో వాయువ్య జిల్లాల్లో వడగాలులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Also read:
Telangana Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై అలా చేశారంటే అంతే సంగతలు..!
TSTET 2022: టెట్ అభ్యర్థులూ బీ అలర్ట్.. టెట్ వెబ్‌సైట్‌లో పాత హాల్‌టికెట్లు..
Telangana: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..