Telangana Weather Update: మళ్లీ కుండపోతే.. తెలంగాణలోని ఆ నాలుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్.. మరికొన్ని ప్రాంతాల్లో..

|

Oct 16, 2021 | 1:59 PM

Telangana Weather Update: ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశాలను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో, దేశంలోని పలు ప్రాంతాల్లో

Telangana Weather Update: మళ్లీ కుండపోతే.. తెలంగాణలోని ఆ నాలుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్.. మరికొన్ని ప్రాంతాల్లో..
Weather Update
Follow us on

Telangana Weather Update: ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశాలను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో, దేశంలోని పలు ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. వాతావరణ శాఖ ఆరేంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం, ఆదివారం ఆదిలాబాద్, కోమరంభీం, అసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ హెచ్చరించింది. దీంతోపాటు హైదరాబాద్ సహా మిగతా 26 జిల్లాలకు వాతారవణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లా అధికారులను సైతం ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో..
కాగా.. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో సైతం వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపటివరకూ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read:

CM MK Stalin: 6వ తరగతి విద్యార్థినికి ఫోన్ చేసిన సీఎం.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

Viral Video: కిలాడీలను మించిన దొంగ కుక్క.. గప్‌చుప్‌గా మటన్ ముక్క మాయం.. సీన్ చూస్తే నవ్వులే నవ్వులు..