TRS Plenary Photo Exhibition: 21 వసంతాలు పూర్తి చేసుకొని 22 వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న సందర్భంలో హెచ్ఐసీసీ (HICC)లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీలో ఫోటో ఎగ్జిబిషన్ హైలెట్‌గా నిలిచింది. మునుగొడుకు నేత కర్నాటి విద్యాసాగర్ (Karnati Vidyasagar)ఏర్పాటు చేసిన ఈ ఫోటో గ్యాలరీలో 2001 నుండి 2022 వరకు తెలంగాణ ఉద్యమం మొదలు స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కార్ సృష్టించిన అద్భుతాలు, పథకాలను చాటేలా ఫోటోలు ఉన్నాయి. అటు తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ ఫోటోలు.. అలాగే కేసీఆర్ తల్లిదండ్రులు, గురువులతో ఉన్న ఫోటోలు.. కేటీఆర్ ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేసీఆర్ విజయాలను, తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎలా నడిపించారో ఫోటోల ద్వారా వివరించారు.
ఈ ఫోటో ఎగ్జిబిషన్ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అలాంటి అరుదైన ఫోటోలను ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు. అనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని, ఎన్నో పోరాటాల మధ్య ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఆనాటి ఫోటోలను చూస్తుంటే చేసిన ఉద్యమాలు గుర్తుకు వచ్చేలా ఉన్నాయని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: