TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టులో వాడీవేడిగా వాదనలు

|

Nov 30, 2022 | 6:52 PM

ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టులో వాడీవేడీ వాదనలు కొనసాగాయి. సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిందితుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు..

TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టులో వాడీవేడిగా వాదనలు
Ts High Court
Follow us on

ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టులో వాడీవేడీ వాదనలు కొనసాగాయి. సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిందితుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వారి కనుసన్నల్లోనే పని చేస్తోందని వివరించారు. అనంతరం వాదనలు వినిపించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడమే కేంద్రంగా కుట్ర జరిగిందన్నారు. బీజేపీకి సంబంధం లేదంటూనే నిందితుల తరపున పిటిషన్లు వేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

చాలా రాష్ట్రాల్లో సర్కార్‌ను కూలదోసిందని ఆరోపణ

ఫామ్‌హౌస్‌ ఎపిసోడ్‌లో కేసు నమోదైన మరుక్షణం నుంచే బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ తరఫు న్యాయవాది. గత కొన్నేళ్లలో బీజేపీ చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిందన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొని చార్టెడ్ ఫ్లైట్లలో తీసుకెళ్లి కూలదోశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదు:

కేసును కేవలం రాజకీయ కోణంలోనే నమోదు చేశారన్నారు నిందితుల తరఫు న్యాయవాది. దర్యాప్తు అధికారి నిష్పక్షపాతంగా నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ప్రస్తుతం దర్యాప్తు అలా జరగడం లేదని, సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉందని వాదించారు. ఇరువర్గాలు పోటాపోటీగా తమ వాదనలు వినిపించారు. అయితే వాదనలు మరింత హీటెక్కిన సమయంలో మర్యాద పాటించాలని ఇరువురికి సూచించారు సీజే. ఇద్దరి మధ్య ప్రిలీమినరీ ఆర్గ్యుమెంట్స్‌ మాత్రమే జరిగాయి. తదుపరి విచారణను డిసెంబర్‌ 6కు వాయిదా వేసింది హైకోర్టు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి