MLC Kavitha: మరోసారి స్థానిక కోటా ఎమ్మెల్సీ బరిలో కవిత.. ఇవాళ 4 సెట్ల నామినేషన్ల దాఖలు

సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. మంగళవారం స్థానిక కోటా ఎమ్మెల్సీకి ఆమె నామినేషన్ దాఖలు చేశారు.

MLC Kavitha: మరోసారి స్థానిక కోటా ఎమ్మెల్సీ బరిలో కవిత.. ఇవాళ 4 సెట్ల నామినేషన్ల దాఖలు
Kavitha

Updated on: Nov 23, 2021 | 3:22 PM

Kavitha filed Nominations for MLC: తెలంగాణలో జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేసన్ ప్రక్రియ గడువు దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. ఇవాళ సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. మంగళవారం స్థానిక కోటా ఎమ్మెల్సీకి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. కవిత వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్దన్, ఉమ్మడి జిల్లా ఎమ్మేల్యేలు ఉన్నారు. మొత్తం కవిత తరపున నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. 90 శాతం ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, వారంతా సహకరించి గెలిపిస్తారని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, మంగళవారంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్లకు గడువు ముగియనుంది.

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 824 ఓటర్లకు గాను 84 శాతం మేర బలంతో టీఆర్ఎస్ పార్టీ గెలుపు సునాయాసంగా మారింది. స్థానిక సంస్థల పోరులో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బలం లేకపోవడంతో పోటీకి వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఎవరు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో బీజేపీ నుంచి నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ సైతం ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు నిజామాబాద్‌లో కాంగ్రెస్ నేతలు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత గెలుపు లాంఛనప్రాయం కానునున్నది.

Read Also…Priyanka Chopra: కూతురి విడాకుల పై క్లారిటీ ఇచ్చిన ప్రియాంక చోప్రా తల్లి..