
కొత్త బైక్ కొంటే రూ. 2 వేలు.. కారు కొంటే రూ. 5వేలు.. భారీ వాహనాలు అయితే రూ. 10వేల సెస్సు కింద చెల్లించాల్సి ఉంటుంది. రహదారి భద్రతా సెస్సు కింద దీన్ని వసూలు చేయనుంది ప్రభుత్వం. అలాగే, తేలికపాటి రవాణా వాహనాల త్రైమాసిక పన్నును లైఫ్‌ట్యాక్స్‌గా మార్పు చేశారు. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది ప్రభుత్వం. ఆటోలు, ట్రాక్టర్ ట్రాలీలకు రోడ్‌సేఫ్టీ సెస్సు నుంచి మినహాయింపు కల్పించారు. రోడ్‌సేఫ్టీ సెస్సు కింద ప్రభుత్వానికి ఏటా రూ. 300 కోట్ల అదనపు ఆదాయం రానుంది. ఇటీవలే వాహనాలపై లైఫ్‌ట్యాక్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు కొత్తగా రోడ్‌సేఫ్టీ సెస్సు విధించింది. కొత్త వాహనాలు కొనుగోలుచేసేవారికి ఈ రెండు భారంగా మారనున్నాయి. మరోవైపు ఈ రోడ్ సేఫ్టీ సెస్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను బలపరిచేందుకు రోడ్ సేఫ్టీ సెస్ విధించాలని నిర్ణయించామన్నారు. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు ఇది వరిస్తుందని తెలిపారు. అటు ఏపీలో దీనిని 10 శాతంగా నిర్ణయించి ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
Telangana to impose road safety cess on all new vehicle registrations: ₹2,000 for bikes, ₹5,000 for cars, ₹10,000 for heavy vehicles.#Telangana #RoadSafety #VehicleTaxhttps://t.co/vRA71yeMfX
— Hyderabad News Hunt (@hydnewshunt) January 2, 2026
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..