Telangana: వీళ్లు ట్రైన్ టికెట్స్ కొంటారు.. కానీ ప్రయాణం చేయరు.. ఎందుకో తెల్సా..?

|

Feb 12, 2024 | 11:12 AM

టికెట్లు కొంటారు.. ప్రయాణం చేయరు... అంతేకాదు ఇలా ట్రైన్ టికెట్లు కొనేందుకు.. వ్యాపారులు, దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తుండటం విశేషం. ఈ తంతు వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో జరుగుతోంది. నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఇదే ఏకైక రైల్వేస్టేషన్‌. వీరు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందాం పదండి...

Telangana: వీళ్లు ట్రైన్ టికెట్స్ కొంటారు.. కానీ ప్రయాణం చేయరు.. ఎందుకో తెల్సా..?
What's app Group Members
Follow us on

ఫిబ్రవరి 12: వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో కొందరు రోజూ 60కి పైగా ప్రయాణ టికెట్స్ కొంటారు. కానీ ఎక్కడికీ ట్రావెల్ చేయరు. అరె.. అలా ఎందుకు అని మీ డౌట్ వచ్చే ఉంటుంది. తమ ఊరి ట్రైన్ హాల్టింగ్ క్యాన్సిల్ కాకుండా ఉండేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం ఊర్లోని అన్ని వర్గాల వారు ఏకమయ్యారు. ట్రైన్ టికెట్స్ కొనేందుకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున డొనేషన్స్ కూడా ఇస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి నెక్కొండ ఏకైక రైల్వేస్టేషన్‌‌గా ఉంది. నియోజవర్గంలోని పలు మండలాలకు చెందినవారు ఎటైనా పోవాలంటే.. ఇక్కడికే వస్తుంటారు. హైదరాబాద్, తిరుపతి, ఢిల్లి, శిర్డి వంటి ప్రధాన ప్రాంతాలకు వెళ్లేవారు.. ఇక్కడ చాలా ట్రైన్స్ హాల్టింగ్‌ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అది చాలదన్నట్లు ఆదాయం పెద్దగా లేదన్న సాకుతో.. రైల్వే అధికారులు… పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రిటన్ ప్రయాణంలో నెక్కొండ స్టేషన్‌లో హాల్టింగ్ క్యాన్సిల్ చేశారు.

స్థానిక ప్రజలు.. పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వడంతో… ఇటీవల సికింద్రాబాద్‌ నుంచి గుంటూరుకు వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు టెంపరరీ హాల్టింగ్‌  ఇచ్చారు. అయితే రైల్వే అధికారులు ఓ కండీషన్ కూడా పెట్టారండోయ్. 3 నెలలపాటు ఆదాయం వస్తేనే పూర్తిస్థాయిలో హాల్టింగ్‌ కల్పిస్తామని, లేకపోతే రద్దు చేస్తామని చెప్పారు. దీంతో హాల్టింగ్‌ కోల్పోకూడదనుకున్న గ్రామస్థులు ఏకమయ్యారు. ఇందుకోసం ఏకంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ‘నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్‌ ఫోరం’ పేరుతో వాట్సప్‌ గ్రూపు క్రియేట్ చేశారు. ఇందులో సుమారు 400 మంది జాయిన్ అయ్యారు. వీరంతా ఇప్పటి వరకు విరాళాల రూపంలో రూ.25 వేలు సమకూర్చారు. ఈ డబ్బుతో రోజూ నెక్కొండ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాలకు ట్రైన్ టికెట్స్ కొంటున్నారు. స్టేషన్‌కు ఇన్‌కం చూపించడం కోసమే ఇలా చేస్తున్నామని, మరిన్ని రైళ్ల హాల్టింగ్‌ కోసం అందరం కలిసి ముందుకు వెళ్తామని..  గ్రూపు అడ్మిన్లు రాంగోపాల్‌, వేణుగోపాల్‌రెడ్డి, వెంకన్న, మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..