Telangana: తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ కొత్త రూపు.. సెప్టంబరు 17 వేడుకలకు హస్తం సన్నద్ధం

|

Sep 14, 2022 | 2:09 PM

ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ విడుదల చేసింది. ఈ సందర్బంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

Telangana: తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ కొత్త రూపు.. సెప్టంబరు 17 వేడుకలకు హస్తం సన్నద్ధం
Telangana Thalli
Follow us on

Telangana: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సరికొత్తగా తయారు చేయిస్తోంది. కొత్త రూపురేఖలతో తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెప్టెంబరు 17న రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ విడుదల చేసింది. ఈ సందర్బంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి సామాన్యులకు ప్రతిరూపంగా ఉండేలా తీర్చిదిద్దామని తెలిపారు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం బంగారు కిరీటం, వజ్ర వైఢూర్యాలను ధరించి దొరలకు ప్రతిరూపంగా ఉందని ఆయన ఆరోపించారు.

తెలంగాణ తల్లి కష్టజీవి,ఊరి సంస్కృతికి ప్రతిరూపం,మన తల్లి దొరల గడీలలో దొరసాని కాదన్నారు కాంగ్రెస్‌ నేతలు. ఒంటి నిండా వజ్రవైడుర్యాలు పొదిగిన నగలు, నెత్తిన బంగారు కిరీటాన్ని ధరించి రాచరికానికి ప్రతిరూపంగా రాజదర్పాన్ని కలిగి ఉండటం మన తల్లి లక్షణం కానే కాదంటున్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి 75 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంలో ప్రతి పల్లె, ప్రతిపట్నం, ప్రతి తండా, ప్రతి గూడెం…ఊరు వాడ ఏడాది పాటు మన వారసత్వ ఘనతను చాటుదామని పిలుపునిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ . ఈ విగ్రహాన్ని సెప్టంబరు 17న ఆవిష్కరించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి