TS Irrigation Department: అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారు.. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదు

|

Jun 22, 2021 | 8:41 PM

Krishna Board: ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. AP సర్కార్ అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు...

TS Irrigation Department: అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారు.. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదు
Special Principal Secretary
Follow us on

ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. AP సర్కార్ అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే ఆపేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈమేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ కృష్ణా బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌కు లేఖ రాశారు.

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్టే విధించినప్పటికీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని లేఖలో రజత్ కుమార్ పేర్కొన్నారు. ఎన్జీటీ ఆదేశాలను కృష్ణా బోర్డు అడ్డుకోలేకపోయిందన్నారు. DPR కోసం ప్రాథమిక పనులు అని చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అక్కడ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తోందని ఆరోపించారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు కనీసం నిజనిర్ధారణ కమిటీని కూడా అక్కడకు పంపలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

కృష్ణా బోర్డు అనుమతులు, ఆమోదం లేకుండా పనులు చేపట్టరాదని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు.  ఇటీవల జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఏపీ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారన్న  రజత్‌కుమార్‌.. ఏపీ చర్యలతో తెలంగాణలోని కృష్ణాబేసిన్‌లో ఉన్న కరవు, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని తెలిపారు.

అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే ఆపేలా తగు చర్యలు తీసుకోవాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయబద్ధమైన వాటాను పరిరక్షించాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన చిత్రాలను కూడా లేఖతో జతపరిచారు.

ఇవి కూడా చదవండి : Defamation Case: మాజీ ప్రధానికి షాక్.. పరువు నష్టం కేసులో భారీ జరిమానా..

IND Vs NZ, WTC Final 2021 Day 5th Live: వర్షం కారణంగా ఒక గంట ఆలస్యం.. మొదలైన ఐదో రోజు ఆట