Telangana: రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు..!

| Edited By: Balaraju Goud

Dec 25, 2024 | 2:07 PM

పాడుబడిన వ్యవసాయ భూముల్లో సోలార్ ఫ్లాంట్ ఏర్పాటుకు అనుమతిని ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా, రైతుల ఆదాయానికి అదనపు మార్గాలను అందిస్తుందన్నారు భట్టి విక్రమార్క. ఇది పునరుద్ధరణీయ ఇంధన వినియోగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. రైతులు, సహకార సంఘాలు, పంచాయతీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌లు, వాటర్ యూజర్ అసోసియేషన్‌లు ఈ పథకంలో పాల్గొనేందుకు అర్హులు.

Telangana: రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు..!
Solar Power Plants
Follow us on

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంట సాగుతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తిని అనుసంధానించే వినూత్న చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకంలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా రైతులు తమ వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఈ మేరకు రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు ఇస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ కార్యక్రమం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి వారికి అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

పాడుబడిన, ఎండిపోయిన వ్యవసాయ భూముల్లో సోలార్ ఫ్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం కింద 0.5 మెగావాట్ల నుండి రెండు మెగావాట్ల వరకు సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తు చేయవచ్చు. దీంతో కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తిని చేయడంతో పాటు రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. తమ వ్యవసాయ భూములను సోలార్ విద్యుత్ ప్లాంట్ అభివృద్ధి కోసం భూమిని రైతులు లీజుకు ఇచ్చుకోవచ్చని ఆయన తెలిపార. డిస్కమ్‌ల ద్వారా రైతులకు డెవలపర్లకు మధ్య ఒప్పంద మేరకు లీజు మొత్తం అందించడ జరగుతుది. ఈ పథకం కోసం దరఖాస్తులు TGREDCO ద్వారా ఆన్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. ఇలా సోలార్ విద్యుత్తును రూ. 3.13/కిలో వాట్ గంట(KWH) ధర వద్ద 25 సంవత్సరాల పాటు డిస్కం‌లు కొనుగోలు చేస్తాయని డిప్యూటీ సీఎం తెలిపారు.

పథకంలోని ముఖ్యాంశాలు-

• 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్లను వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది.

• ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (TG REDCO) నోడల్ ఏజెన్సీగా అమలు చేస్తుంది.

• సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం పాడుబడిన లేదా సాగుకు అనుకూలం కాని భూములను వినియోగించుకోవచ్చు.

• ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును రూ.3.13/యూనిట్ ధరకు డిస్కంలు 25 ఏళ్లపాటు కొనుగోలు చేస్తాయి.

రైతులకు అదనపు ఆదాయం లక్ష్యం-

ఈ పథకం ద్వారా రైతులకు పర్యావరణ అనుకూలమైన, కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తితో పాటు అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడం ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భూమి యజమానులు తమ భూమిని సోలార్ విద్యుత్ ప్లాంట్ కోసం లీజుకు ఇవ్వవచ్చు లేదా స్వయంగా ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ

• రైతులు, సహకార సంఘాలు, పంచాయతీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌లు, వాటర్ యూజర్ అసోసియేషన్‌లు ఈ పథకంలో పాల్గొనేందుకు అర్హులు.

• TG REDCO వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

• సమీపంలోని TG REDCO జాబితాలో పేర్కొన్న సబ్‌స్టేషన్ పరిధిలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు.

పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు మేలు

ఈ పథకం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా, రైతుల ఆదాయానికి అదనపు మార్గాలను అందిస్తుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ముందడుగుగా మాత్రమే కాకుండా, పునరుద్ధరణీయ ఇంధన వినియోగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..