BJP Politics: రహస్య సమావేశాలతో హడావిడి చేసిన నేతలతో.. రాష్ట్ర పార్టీ చీఫ్ సంధి చర్చలు

|

Feb 26, 2022 | 8:01 AM

తెలంగాణ కాషాయ దళంలో ఇంటి పోరు నడుస్తోంది. మొన్న అసమ్మతి రాగం ఆలపించారు. ఇప్పుడు అధ్యక్షుడితోనే భేటీ అయ్యారు. మరి వారి మధ్య గ్యాప్‌ తగ్గించేందుకు సంధి చర్చలు మొదలుపెట్టారు.

BJP Politics: రహస్య సమావేశాలతో హడావిడి చేసిన నేతలతో.. రాష్ట్ర పార్టీ చీఫ్ సంధి చర్చలు
Follow us on

Telangana BJP internal Politics: తెలంగాణ కాషాయ దళంలో ఇంటి పోరు నడుస్తోంది. మొన్న అసమ్మతి రాగం ఆలపించారు. ఇప్పుడు అధ్యక్షుడితోనే భేటీ అయ్యారు. మరి వారి మధ్య గ్యాప్‌ తగ్గించేందుకు సంధి చర్చలు మొదలుపెట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay) సొంత ఇలాఖాలోనే అసమ్మతి రాగం వినిపిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు అసమ్మతి నేతలు భేటీ అవడం పార్టీలో సంచలనం రేపుతోంది. టీఆర్‌ఎస్‌(TRS)పై దూకుడుగా వెళుతున్న పార్టీ పెద్దలకు సొంత పార్టీ నేతల రహస్య భేటీలు తలనొప్పిగా మారాయి. ఒకసారి హెచ్చరించినా వినకుండా మళ్లీ భేటీ అవడంపై అధిష్టానం సీరియస్‌గా ఉంది. యాక్షన్‌కు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలోనే రహస్య సమావేశాలతో హడావిడి చేసిన నేతలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సంధి చర్చలు జరపడం ఆసక్తిగా మారింది. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్, నల్లు ఇంద్రసేనా రెడ్డితో అసమ్మతి నేతలుగా ముద్రపడిన గుజ్జుల రామకృష్ణ రెడ్డి, అర్జున్ రావు భేటీ అయ్యారు. వారిపై వేటు వేయాలని అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఈ చర్చలు జరగడంపై ప్రాధాన్యత సంతరిచుకుంది.

జరిగిన పరిణామాలు, సమాచార లోపాలపై పార్టీ పెద్దలకు కరీంనగర్‌ నేతలు నేతలు వివరించారు. ఎందుకు మీటింగ్‌ పెట్టాల్సి వచ్చింది, అందులో ఏం చర్చించామన్న దాన్ని వివరించినట్లు తెలుస్తోంది. గత నెలలో అసమ్మతి నేతల భేటీ ఎందుకు జరిగిందో తేల్చేందుకు ఇంద్రసేనారెడ్డిని రంగంలోకి దించింది హైకమాండ్. ఆయన రెబల్‌ నేతలను హైదరాబాద్‌ పిలిపించుకొని మాట్లాడారు. ఆ తర్వాత కూడా మళ్లీ అదే తరహా మీటింగ్‌లు జరగడం సంచలనంగా మారింది. పార్టీలో ఏదో జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయింది పార్టీ. ఈ లోపే రెబల్ లీడర్లు సంధి చర్చలకు వచ్చారు. వారి అభిప్రాయాలతో పార్టీ పెద్దలు సంతృప్తి చెందారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది. సంధి చర్చల తర్వాత అసంతృప్తి ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డ్‌ పడినట్లేనని భావిస్తున్నారు నేతలు.

Read Also…  Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా దూకుడును ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి ఓటింగ్‌కు భారత్ దూరం