సరిహద్దు రాష్ట్రాలలోని తెలంగాణ వాసుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు! నెంబర్లు ఇవే..

సరిహద్దు రాష్ట్రాలలో చిక్కుకున్న తెలంగాణ వాసులకు సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24/7 నియంత్రణ గదిని ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్ సహాయం, సమాచారం మరియు సేవలను అందిస్తుంది. ఆ నంబర్లు ఏంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సరిహద్దు రాష్ట్రాలలోని తెలంగాణ వాసుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు! నెంబర్లు ఇవే..
Cm Revanth Reddy

Updated on: May 09, 2025 | 4:48 PM

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్ని ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు రాష్ట్రాలలో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ వాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా సేవలు అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేయనుంది. ఈ వివరాలను ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ తెలిపారు.

  • ల్యాండ్‌లైన్ నంబర్‌: 011-23380556
  • వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ అండ్‌ లైజన్ హెడ్ – 9871999044
  • హైదర్ అలీ నఖ్వీ, రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడు – 9971387500
  • జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ – 9643723157
  • సిహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ – 9949351270