Telangana: ‘చాలా బాగున్నారు మేడమ్’ అనే కాంప్లిమెంట్.. స్మిత మేడమ్ ఆన్సర్ ఇదే

|

Feb 21, 2023 | 1:58 PM

కామారెడ్డి జిల్లాలో సీఎం కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి పర్యటిస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి...

సీనియర్ IAS, సీఎం కార్యాలయ కార్యదర్శి అధికారిణి స్మితా సబర్వాల్‌ నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.  గర్భిణిలతో ఆమె ముఖాముఖి మాట్లాడుతున్నారు. భిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ప్రతి మహిళకు అమ్మ అవడం అనేది ఒక వరం అన్నారు. న్యూట్రిషన్ కిట్లను ఏ విధంగా వాడుతున్నారని గర్భిణులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో వాళ్లకు వివరించారు. అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. తన వయస్సు మీకంటే డబుల్ ఉంటుందని.. తనకు 18 ఏళ్ల కొడుకున్నాడని.. న్యూట్రిషన్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్లే ఇంత ఆరోగ్యంగా ఉన్నట్లు గర్భిణిలకు వివరించారు.. అదే టైమ్‌లో మీరు బాగున్నారని ఒక మహిళ అనడంతో సమావేశంలో నవ్వులు విరబూశాయి. కాంప్లిమెంట్‌కు థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు స్మిత మేడమ్.

తాను మదర్స్ హార్లిక్స్ తాగనని., ఖర్జూరం తిన్నానని.. న్యూట్రిషన్ కిట్‌లో ఇచ్చిన ఐటమ్స్ అన్నీ తినడం వల్లే తాను ధృడంగా ఉన్నట్లు స్మితా సబర్వాల్‌ చెప్పారు.  ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి కూడా పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం