Telangana BJP: తెలంగాణ బీజేపీలో రగులుతోన్న అసమ్మతి..! ప్రధాని మోదీ సభలకు ఆ నేతల డుమ్మా.. కారణం అదేనా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. దీంతో పార్టీలన్నీ దూకుడుతో వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ దూసుకెళ్తున్నాయి.. అయితే, తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ వరుస సభలతో క్యాడర్‌లో జోష్ నింపుతోంది. స్వయానా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగి..

Telangana BJP: తెలంగాణ బీజేపీలో రగులుతోన్న అసమ్మతి..! ప్రధాని మోదీ సభలకు ఆ నేతల డుమ్మా.. కారణం అదేనా..?
Telangana BJP

Updated on: Oct 04, 2023 | 7:54 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. దీంతో పార్టీలన్నీ దూకుడుతో వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ దూసుకెళ్తున్నాయి.. అయితే, తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ వరుస సభలతో క్యాడర్‌లో జోష్ నింపుతోంది. స్వయానా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగి.. కాషాయ పార్టీలో ఉత్సాహం నింపుతున్నారు.. మహబూబ్‌నగర్, నిజామాబాద్‎లో నిర్వహించిన భారీ సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. పదునైన మాటలతో విపక్షాలపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూనే.. బీజేపీని ఆశీర్వదించాలంటూ తెలంగాణ ప్రజలను కోరారు. అయితే, మోదీ సభలు తెలంగాణ బీజేపీలో సరికొత్త జోష్‌ను నింపుతున్నా.. ఆపార్టీలో అసంతృప్తుల వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో అసంతృప్త నేతల జాబితా క్రమంగా పెరుగుతుండటం.. స్వయంగా ప్రధాని మోదీ వచ్చిన సభలకు కొందరు అసంతృప్త నేతలు డుమ్మా కొట్టడం దుమారం రేపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వేళ కొందరు బీజేపీ నేతలు సభల్లో పాల్గొనకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ సభకు మాజీ ఎంపీ విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి దూరంగా ఉన్నారు. మెన్న జరిగిన పాలమూరు సభకు కూడా వీరు హాజరుకాలేదు.

అయితే, కొంతకాలంగా పార్టీ తీరుపై విజయశాంతి, రాజగోపాలరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రధాని తెలంగాణకు వస్తే ఈ సమయంలో మాజీ ఎంపీ వివేక్ ఢిల్లీలో ఉన్నారు. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కూడా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో పలు ఊహగానాలు వినిపిస్తుండటం అటు పార్టీలో.. ఇటు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో అసమ్మతి నేతలను కమలనాథులు బుజ్జగిస్తారా లేక వారిని వదిలించుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అయితే అసమ్మతి నేతల్లో కొందరు పార్టీ మారే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో అసమ్మతి నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు బీజేపీ జాతీయ స్థాయి నేతలే రంగంలోకి దిగుతారని తెలుస్తోంది.

విజయశాంతి కీలక ట్వీట్..

ఇదిలాఉంటే.. మోదీ సభ అనంతరం విజయశాంతి కీలక ట్వీట్ చేశారు. కేసీఆర్ ఎన్డీఏలో చేరుతామని అడిగారని ప్రధాని మోడీ పేర్కొన్న నేపథ్యంలో.. ఆమె ఈ ట్వీట్ చేశారు.. ప్రధాని మోదీ చెప్పినట్లు కేసీఆర్ ఎన్డీఏలో చేరుతామని అడిగి ఉండొచ్చు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

విజయశాంతి ట్వీట్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..