TSRTC: అవసరమైతే వారి కోసం ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

|

Jan 28, 2024 | 6:11 PM

తెలంగాణ వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏకంగా 12 కోట్లకుపైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారంటేనే ఈ పథకానికి తెలంగాణలో ఎంతటి ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌...

TSRTC: అవసరమైతే వారి కోసం ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌
Sajjanar
Follow us on

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. మహా లక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక మహిళల నుంచి కూడా ఈ పథకానికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏకంగా 12 కోట్లకుపైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారంటేనే ఈ పథకానికి తెలంగాణలో ఎంతటి ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్వయంగా తెలిపారు. తెలంగాణలో తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు.

కేవలం 45 రోజుల్లో 12కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని తెలిపారు. నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో బ్లైండ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్‌ లూయిస్‌ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సజ్జనార్‌ ఈ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సజ్జనార్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఇక ఉచిత ప్రయాణం కారణంగా.. సాధారణ పౌరులకు ఇబ్బందులు ఎదురవుతోన్న విషయం తెలిసిందే. దీనిపై కూడా సజ్జనార్‌ స్పందించారు. వికలాంగులకు కేటాయిచిన సీట్లలో కూడా మహిళలు కూర్చుకుంటున్నారన్న సజ్జనార్‌, ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా త్వరలోనే 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. దీంతో వెసులుబాటు కలుగుతుందని అన్నారు. ఒకవేళ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇర అనౌన్స్‌మెంట్‌, ఎంక్వయిరీ రూమ్‌ ఉద్యోగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తామని సజ్జనార్‌ చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..