Telangana: బీఆర్‌ఎస్‌ నేతల్లో కొత్త టెన్షన్‌.. ఆ ఎంపీ స్థానం ఎవరికి అన్న దానిపై ఉత్కంఠ..

ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇతంగా టెన్షన్ పెడుతున్న ఆ హాట్ ఎంపీ సీట్‌ మరెదో కాదు మెదక్‌. ఈ స్థానం కోసం బీఆర్ఎస్ పార్టీలో చాలామంది గత కొద్దిరోజుల నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. టికెట్ తమకే ఇవ్వాలంటూ పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారట. పార్టీ సీనియర్ లీడర్లను...

Telangana: బీఆర్‌ఎస్‌ నేతల్లో కొత్త టెన్షన్‌.. ఆ ఎంపీ స్థానం ఎవరికి అన్న దానిపై ఉత్కంఠ..
BRS Party
Follow us
P Shivteja

| Edited By: Narender Vaitla

Updated on: Jan 28, 2024 | 5:43 PM

ఎంపీ ఎన్నికలు దగ్గపడుతున్న వేళ ఆ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోందని తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో పోటీలో ఉండేవారి జాబితాలో రెండురోజులకోసారి కొత్తవారి పేరు తెరమీదకు రావడంతో ఆశావహుల్లో గందరగోళం నెలకొంది. చివరికి ఎవరికి టికెట్ వస్తుందో అని ఇప్పటి నుంచే ఆలోచనాలో పడిపోయారట ఆశావాహులు. ఇంతకీ బీఆర్‌ఎస్‌ నేతలను అంతలా టెన్షన్‌ పెడుతోన్న ఆ ఎంపీ సీట్‌ ఎక్కడ.? ఆ స్థానంపై అందరి దృష్టి ఎందుకు పడిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇతంగా టెన్షన్ పెడుతున్న ఆ హాట్ ఎంపీ సీట్‌ మరెదో కాదు మెదక్‌. ఈ స్థానం కోసం బీఆర్ఎస్ పార్టీలో చాలామంది గత కొద్దిరోజుల నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. టికెట్ తమకే ఇవ్వాలంటూ పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారట. పార్టీ సీనియర్ లీడర్లను నిత్యం కలుస్తూ, సీటు విషయాన్ని పదేపదే గుర్తు చేస్తున్నారట. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గల్లో ఆరు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నాయి. ఒక్క సీటు మాత్రం కాంగ్రెస్ దక్కించుకుంది. కాబట్టి మెదక్ ఎంపీ సీటు బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవడం ఖాయం అనే నమ్మకంతో, టికెట్ కోసం కొంతమంది నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.

ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా పోటీ చేయడానికి చాలామంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఒక క్యాండిడేట్ పక్కా అని అనుకునే లోపే, మరో నేత పేరు మీదికి వస్తోందట.. ఇలా రెండు రోజులకోకసారి కొత్త వారి పేరు తెరమీదికి రావడంతో ఆశావాహుల్లో టెన్షన్ పీక్ లెవెల్‌కి వెళుతుందట.. వీరికి తగ్గట్టుగానే పార్టీ పెద్దలు సైతం ఎవరిని నొప్పించకుండా, వారి వద్దకు ఎవరు వచ్చిన నీకే టికెట్ ఇస్తామంటూ చెప్పేస్తున్నారట. ఇలా వారు చెప్పడంతో అసలు చివరి వరకు టికెట్ ఎవరికి దక్కుతుందో అనే మరో టెన్షన్ కూడా ఆశావాహుల్లో మొదలైందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన మదన్ రెడ్డికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ కాకుండా, ఎంపీ టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వలేమని బీఆర్ఎస్ పార్టీ మదన్ రెడ్డికి ఏదో ఒకటి చెప్పి నచ్చచెప్పిందట.. కాగా ఇదే నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన గాలి అనిల్‌కి కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరాడు గాలి అనిల్ కుమార్.

మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నాడట, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా పోటీ చేసిన అనుభవం కూడా ఉన్న నేపథ్యంలో ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్ తనకి ఇవ్వాలని ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసి తన మనసులోని మాటను క్లియర్ గా అధిష్టానానికి చెప్పేశాడట. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్‌కి టికెట్ ఇస్తే బాగానే ఉంటుందని అధిష్టానం కూడా భావించిందట. మరో వైపు ఎమ్మెల్సీగా ఉన్న వెంకటరమణారెడ్డి మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీలో నుంచి పోటీలో ఉండబోతున్నాడని ప్రచారం జరుగుతోందట. ఇతను గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్డీవో, జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా విధులు నిర్వహించిన అనుభవము, పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇతను పోటీలో ఉండబోతున్నాడు అని తీవ్రంగా ప్రచారం జరుగుతోందట.

మెదక్ పార్లమెంటు పరిధిలోని కొంతమంది నేతలతో వెంకటరామిరెడ్డి నిత్యం టచ్ లో ఉంటున్నాడట. వారి కోసం విందు భోజనాలు ఏర్పాటు చేసి తాను పోటీలో ఉంటే మీరంతా తనకు తోడుగా నిలవాలని కోరుతున్నాడట.. వీరిద్దరూ ఇలా ఉంటే వీరితో పాటు మరికొంత మంది నేతలు కూడా మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా గత రెండు రోజుల నుంచి కేసీఆర్ కవిత కూడా పోటీలో ఉండబోతోంది అనే ప్రచారం జరుగుతోంది. ఇలా రోజుకు ఒక కొత్త పేరు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆశవహుల్లో టెన్షన్ మాత్రము రోజు రోజుకు పీక్ లెవల్‌కు వెళ్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..