Telangana corona: తెలంగాణలో ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా.. కొత్తగా రికార్డు స్థాయిలో 7,432 కేసులు,33 మంది మృతి

| Edited By: Team Veegam

Apr 24, 2021 | 11:11 AM

Telangana Corona Cases Update: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకీ పాజివిట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 7,432 మందికి కోవిడ్ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

Telangana corona: తెలంగాణలో ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా.. కొత్తగా రికార్డు స్థాయిలో 7,432 కేసులు,33 మంది మృతి
Follow us on

Telangana corona: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకీ పాజివిట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 1,03,770 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 7,432 మందికి కోవిడ్ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనాతో 33 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక, కరోనా బారి నుంచి నిన్న 2,152 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,87,106కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రాకాసి కోరలకు బలై మరణించిన వారి సంఖ్య 1961 చేరింది. కాగా, దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.1 శాతంగా ఉంటే, రాష్ట్రంలో 0.51 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా కోలుకుంటున్న వారు మొత్తంగా చూస్తే 86.16% ఉందని వెల్లడించారు. శుక్రవారం నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,464 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇక, ఆ తర్వాత స్థానంలో మేడ్చల్ జిల్లాలో 606, రంగారెడ్డి జిల్లాలో 504 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 486 కేసులు రికార్డు అయ్యాయి.

తెలంగాణ జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి…

Telangana Corona Virus

Read more: మీకు కరోనా సోకిందా.. అయితే ఆరోగ్య భీమా ఎంత ఉండాలో తెలుసా..

CM KCR: రోజాను పరామర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా..

హైదరాబాద్ లో నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈ ఆదివారం మాంసం దుకాణాల బంద్.. కారణం అదేనా..?