Telangana Corona: తెలంగాణ వ్యాప్తంగా కరోనా పంజా.. 4 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు.. ఆదివారం ఒక్కరోజే 43 మంది మృతి

|

Apr 26, 2021 | 11:03 AM

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 73,275 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 6,551 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

Telangana Corona: తెలంగాణ వ్యాప్తంగా కరోనా పంజా.. 4 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు.. ఆదివారం ఒక్కరోజే 43 మంది మృతి
Second Covid Wave
Follow us on

Telangana Corona Virus Cases: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 73,275 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 6,551 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 43 మంది మృతిచెందారు.
కరోనా పంజా విసురుతోంది అయితే, నిన్నతో పోల్చితే కాస్త తక్కువ కేసులు నమోదయ్యాయి. కాగా.. మరణాల సంఖ్య మాత్రం అమాంతం పెరిగాయి. రాష్ట్రంలో వైరస్‌ ప్రభావంతో 43 మంది మృతి చెందినట్లు పేర్కొంది. నిన్న ఒకే వైరస్‌ నుంచి కోలుకొని 3,804 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న కేసులతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ప్రస్తుతం 65,597 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఇక, కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,01,783కు పెరగ్గా.. ఇప్పటి వరకు 3,34,144 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 2,042 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,418, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 554, రంగారెడ్డిలో 482, నిజామాబాద్‌లో 388, సంగారెడ్డిలో 368, వరంగల్‌ అర్బన్‌లో 329, జగిత్యాలలో 276, కరీంనగర్‌లో 222, మహబూబ్‌నగర్‌లో 226, సిద్దిపేటలో 268 అత్యధికంగా కరోనా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది.

Telangana Corona Virus

Read Also….   కోవిడ్ గురించి భయపడకండి, నిర్భయంగా ఓటు వేయండి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ