Telangana: గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయోచ్.. ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోండి..
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి.. అలాంటి వారికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోని అనేక జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. మే నెల నుంచి రేషన్ తీసుకునేందుకు అర్హులంటూ ప్రభుత్వం లబ్ధిదారులు అందరికీ.. మెస్సెజ్‌లు కూడా పంపించింది..

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి.. అలాంటి వారికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోని అనేక జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. మే నెల నుంచి రేషన్ తీసుకునేందుకు అర్హులంటూ ప్రభుత్వం లబ్ధిదారులు అందరికీ.. మెస్సెజ్‌లు కూడా పంపించింది.. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిందని.. ఈ కార్డుల ద్వారా లబ్ధిదారులు చౌక ధరల దుకాణాల (రేషన్ షాపు) నుంచి మే కోటా బియ్యం పొందవచ్చని అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డు నెంబర్ తో సహా మెస్సెజ్ లు వచ్చాయని.. వారు స్టేటస్ ను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే.. దరఖాస్తు చేసుకున్న వారు మీ సేవాలో ఇచ్చిన రిఫరెన్స్ నంబర్ ఆధారంగా స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు..
అయితే.. లబ్ధిదారులు రేషన్ కార్డు నెంబర్ ప్రకారంతో అధికారిక వెబ్‌సైట్‌లో తమ కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. దీనిలో కార్డులోని కుటుంబసభ్యుల పూర్తి వివరాలు కనిపిస్తాయి.. అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత.. రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి.. ఆ తర్వాత మీ జిల్లా పేరును సెలెక్ట్ చేసుకోవాలి.. ఆ తర్వాత సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి.. ఇదిలాఉంటే.. రేషన్ కార్డు స్థితి తెలియకపోతే.. దరఖాస్తు చేసుకున్న వారు స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు.
కొత్త రేషన్ కార్డు డౌన్‌లోడ్ కోసం, స్థితిని తెలుసుకునేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి..
అంతేకాకుండా ఏళ్లుగా రేషన్ కార్డులో మార్పులు, చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కీలక అప్డేట్ ఇచ్చింది.. చేర్పులు, మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ప్రకారం.. పేర్లను కూడా యాడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికోసం కూడా పైన ఇచ్చిన లింకును క్లిక్ చేయండి.. దీనిలో పాత రేషన్ కార్డు నంబర్‌ను నమోదు చేయడం ద్వారా, కార్డులోని సభ్యుల జాబితాను చూడవచ్చు.. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
కాగా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు, ప్రజా పాలన, గ్రామ సభలు, కుల గణన సర్వేల ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా, ఏ రేషన్ షాపుకు వెళ్లినా లబ్ధిదారులకు రేషన్ సరకులు అందుతాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




