KTR White Challenge to Rahul Gandhi: రాహుల్ జీ, వైట్‌చాలెంజ్‌కి సిద్ధమా.. నగరంలో ఎక్కడ చూసినా ఈ బ్యానర్లే. కాంగ్రెస్ పార్టీ టాప్ పొలిటీషియన్ రాహుల్ గాంధీకి సవాల్ విసురుతూ వెలిశాయి ఈ బ్యానర్లు. శుక్రవారం రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఈ బ్యానర్లు పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. రాహుల్ జీ.. వైట్ చాలెంజ్‌కి సిద్ధమా అన్న ప్రశ్న ఆ బ్యానర్లలో ఉంది. గన్‌పార్క్, ట్యాంక్ బండ్ దగ్గర ఈ బ్యానర్లు వెలిశాయి.
నిజానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డే ఈ వైట్ చాలెంజ్‌కి ఆద్యులు. గతంలో డ్రగ్స్ విషయంలో అనేకసార్లు ప్రభుత్వంపై విమర్శలకు దిగిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌కి సవాల్ విసిరారు. కేటీఆర్ వైట్ చాలెంజ్‌కి సిద్ధమా అంటూ పెద్ద ఉద్యమాన్నే లేపారు. నేను సిద్ధమే.. రాహుల్ కూడా సిద్ధమా అంటు అప్పట్లో రివర్స్ చాలెంజ్ విసిరారు కేటీఆర్.
ఆతర్వాత సద్దుమణిగిపోయిన ఈ వైట్ చాలెంజ్ గొడవ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చిది. ఇటీవల నేపాల్‌లో ఓ వివాహవేడుకలో పాల్గొన్న రాహుల్ వీడియో వివాదాస్పదం కావడంతో.. ఆ ఫొటోలతోనే బ్యానర్లు ప్రింట్ చేశారు కొందరు. Are You Ready అంటూ రాహుల్‌ని చాలెంజ్ చేస్తున్నారు. వైట్‌చాలెంజ్‌లో పాల్గొనాలంటూ రాహుల్‌గాంధీకి ప్రశ్నలెదురవుతున్నాయి.
అటు టీఆర్‌ఎస్ నేతలు కూడా సోషల్ మీడియాలో క్యాంపేన్ మొదలు పెట్టారు. మా మంత్రి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు.. మీరూ సిద్ధమేనా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. గతంలో రేవంత్ చేసిన ట్వీట్లను మళ్లీ షేర్ చేస్తూ రాహుల్‌ని ప్రశ్నిస్తున్నారు టీఆర్‌ఎస్ కేడర్.