TG Weather: తెలంగాణలోని ఈ జిల్లాల్లో 2 రోజుల భారీ వర్షాలు

తెలంగాణలో జూలై 21, 22 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, మిగతా ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి .

TG Weather: తెలంగాణలోని ఈ జిల్లాల్లో 2 రోజుల భారీ వర్షాలు
Telangana Weather Report

Updated on: Jul 20, 2025 | 9:56 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల కారణంగా భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి కీలక హెచ్చరిక జారీ చేసింది. జూలై 21, 22 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డా. కె. నాగరత్నం తెలిపారు. ఈ నేపథ్యంలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని సూచించారు. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీసే అవకాశం ఉందన్నారు.

ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి,
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మెదక్, కామారెడ్డి జిల్లాలు ఆరెంజ్ అలర్ట్‌లో ఉన్నాయి.

జూలై 21: పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

జూలై 22: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వెల్లడించారు.

నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో తక్కువ తీవ్రతతో వర్షాలు ఉంటాయని అంచనా వేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.