Bjp vs TRS: RRR సినిమా చూసి భ్రమపడ్డ అమిత్ షా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..

|

Jun 07, 2022 | 6:42 PM

Bjp vs TRS: బీజేపీ నేతల ప్రచారంపై టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే వివేకానంద సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అనేది మరోసారి

Bjp vs TRS: RRR సినిమా చూసి భ్రమపడ్డ అమిత్ షా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..
Mla Viveka
Follow us on

Bjp vs TRS: బీజేపీ నేతల ప్రచారంపై టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే వివేకానంద సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అనేది మరోసారి రుజువైందన్నారు. మంగళవారం నాడు టీఆరెస్ ఎల్‌పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలకు చేసిందేంటో చెప్పుకోలేక తప్పు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ తప్పుడు ప్రచారాలతో మాత్రమే ముందుకు వెళ్తోందని, ప్రజల మద్ధతు కాదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పేరు మార్చి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నారని విమర్శించారు. చరిత్రను వక్రీకరించి బీజేపీకి అనుకూలంగా మలుచుకోవాలనే ఆలోచన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అల్లూరి సీతారామరాజు తెలంగాణ కోసం పోరాటం చేశారు అనడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ‘RRR’ సినిమా చూసి అమిత్ షా బ్రమ పడ్డారని ఎద్దేవా చేశఆరు. అట్టర్ ప్లాప్ అయిన గుజరాత్ మోడల్ పేరుతో దేశం అంతా తిరిగి.. ప్రజలను మోసం చేశారని అన్నారు. యూపీ ముఖ్యమంత్రితో పోల్చి మాట్లాడిన మోడీకి అక్కడ ఓట్లు, సీట్లు తగ్గిన విషయం మర్చిపోయారా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు ఎమ్మెల్యే వివేకానంద. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకాన్ని.. ప్రధాని మోదీ కాపీ కొట్టారని విమర్శించారు. పైగా, ప్రతీ ఇంటికి నీళ్లు ఇస్తున్నట్లు కేంద్ర వెబ్‌సైట్‌లో పెట్టుకోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం అని అన్నారు.

ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైనా విమర్శలు చేశారు ఎమ్మెల్యే వివేకానంద. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కన్ఫ్యూజన్ మంత్రిగా మారారని సెటైర్లు వేశారు. రాష్ట్రానికి, హైదరాబాద్ కు నిధులు, ప్రాజెక్టులు తేవడంలో వైఫల్యం చెందారని అన్నారు. ఇక మసీదుల అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పైనా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే వివేకా. మసీదు తవ్వి శివలింగాలను వెతుకుతానంటూ చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ స్టేట్మెంటా? లేక సంజయ్ వ్యక్తిగత స్టేట్మెంటా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ స్టేట్మెంట్‌పై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు చేసేందుకు ట్రైనింగ్ ఇవ్వడానికే గ్రేటర్ కార్పొరేటర్లను ఢిల్లీకి పిలిపించుకున్నారా? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే.