Congress: కాంగ్రెస్‌లో చేరాలా? అయితే, ముందు ఆయన్ను కలవాల్సిందే..

|

Sep 30, 2023 | 7:43 AM

Hyderabad, September 30: డీకే శివకుమార్‌.. కన్నడనాట కాంగ్రెస్‌ విజయం తర్వాత ఒక్కసారిగా ఆయన గ్రాఫ్‌ పెరిగింది. కాంగ్రెస్‌లో ఆయన ఏం చెబితే అది.. ఎంత చెప్తే అంత.. అందుకే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తరచూ ఆయనను కలుస్తున్నారు. అంతేకాదు.. ఇతర పార్టీల నుంచి జంప్‌ అవ్వాలనుకుంటున్న ఆశావహులూ ఆయన కోసమే వెయిటింగ్‌ చేస్తున్నారు. మరి డీకేకు ఎంతకంత క్రేజ్.. ఎందుకంత ఇంపార్టెన్స్.. ప్రత్యేక కథనం మీకోసం..

Congress: కాంగ్రెస్‌లో చేరాలా? అయితే, ముందు ఆయన్ను కలవాల్సిందే..
Congress
Follow us on

Hyderabad, September 30: డీకే శివకుమార్‌.. కన్నడనాట కాంగ్రెస్‌ విజయం తర్వాత ఒక్కసారిగా ఆయన గ్రాఫ్‌ పెరిగింది. కాంగ్రెస్‌లో ఆయన ఏం చెబితే అది.. ఎంత చెప్తే అంత.. అందుకే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తరచూ ఆయనను కలుస్తున్నారు. అంతేకాదు.. ఇతర పార్టీల నుంచి జంప్‌ అవ్వాలనుకుంటున్న ఆశావహులూ ఆయన కోసమే వెయిటింగ్‌ చేస్తున్నారు. మరి డీకేకు ఎంతకంత క్రేజ్.. ఎందుకంత ఇంపార్టెన్స్.. ప్రత్యేక కథనం మీకోసం..

ఏ పార్టీలో అయినా.. ఒకరుంటారు. ఆ వ్యక్తిని కలిస్తే చాలు పని త్వరగా అయిపోతుంది. ఆయనకు అపారమైన అనుభవమే కాదు.. అంతులేని పలుకుబడి.. ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. సౌతిండియా కాంగ్రెస్‌కు అలాంటి వారే డీకే శివకుమార్‌. దక్షిణాదిలో కాంగ్రెస్‌ ఏం చేయాలన్నా.. శివన్న అనుగ్రహం ఉండాల్సిందే. ఆయనతో అయితే పని వెంటనే అయిపోతుంది. అంతేకాదు.. అధిష్టానానికి డైరెక్ట్‌ యాక్సెస్‌ ఉండడం వల్ల ఆయన దగ్గరికే సౌత్‌ కాంగ్రెస్‌ పాలిటిక్స్‌ చేరుకుంటున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్‌ విజయం దాదాపు ఆయన ఖాతాలోకే వెళ్లింది. అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి ఫండింగ్‌ వరకు అంతా ఆయనే చూసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ పెద్దలు శివకుమార్‌ని ప్రత్యేకమైన లీడర్‌గా పరిగణిస్తోంది. అంతేకాదు పెద్దలతో ఏదైనా పనుంటే శివన్ననే కలుస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, ఇతర పార్టీల్లో ఉండే ఆశావహులు.

గతంలో రేవంత్‌ రెడ్డి పలుమార్లు డీకే శివకుమార్‌తో భేటీ అయిన సందర్భాలున్నాయి. అయితే అప్పటివరకు కాంగ్రెస్‌ నేతలే కలుస్తుండడం ఒక ఎత్తైతే.. కొన్ని నెలల క్రితం వైఎస్‌ షర్మిల డీకే శివకుమార్‌ని కలవడం మరో ఎత్తు. కాంగ్రెసేతర నేత కావడంతో పార్టీ విలీన ప్రచారం జోరందుకుంది. డీకేతో అవే చర్చలు జరిగినట్లు లీకులు బయటకు వచ్చాయి. పాత పరిచయాలు.. వైఎస్సార్‌ ఉన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతోనే.. కర్నాటక విజయంపై అభినందించడానికి కలిశానంటూ షర్మిల క్లారిటీ ఇచ్చారు. కాని అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు వేరు.

ఇక.. పార్టీలో చేరకముందే తుమ్మల నాగేశ్వరరావు కూడా డీకే శివకుమార్‌ని కలిశారు. ఆయనతో చర్చల తర్వాతే పార్టీ కండువా కప్పుకున్నారు తుమ్మల. ఇక నిన్న మోత్కుపల్లి నర్సింహులు కూడా డీకేని కలవడం ఆయన కూడా పార్టీ మారతారని.. అధిష్టానాన్ని కలవడంలో భాగంగానే డీకేని ప్రసన్నం చేసుకునేందుకు బెంగళూరు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఇతర పార్టీ నేతలు వరుసగా కలవడం చూస్తే.. కాంగ్రెస్‌లో శివన్న ఇమేజ్‌ని.. ఆయన మాటకు.. వ్యూహాలకు ఉన్న వాల్యూని అర్థం చేసుకోవచ్చు. కర్నాటకలో పాపులర్‌ లీడర్‌ మాత్రమే కాదు.. సౌత్‌ రీజియన్‌లో కాంగ్రెస్‌కి డీకే కింగే అని చెప్పాలి. మకుటం లేని మహారాజుగా చలామణి అవుతున్నారు డీకే శివకుమార్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..