KA Paul Phone Call: కేఏ పాల్ ఫోన్ చేస్తున్నాడు.. ఎలా తప్పించుకోవాలిరా బాబు.. ఆ పార్టీ నేతల్లో హై టెన్షన్..
తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కమిటీలను సైతం వేస్తూ ఇక్కడి రాజకీయ నాయకులను కలుస్తూ ఉన్నారు. అయితే కేఏ పాల్ ఒక రాజకీయ నాయకుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారట. ఇంతకు కేఏ పాల్ ఆ రాజకీయ నాయకున్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో తెలిస్తే మీరు కూడా అలర్ట్ అవుతారు.

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కేఏ పాల్ తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నారు కేఏ పాల్. ఇప్పుడు ఆరు నెలల్లో తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కమిటీలను సైతం వేస్తూ ఇక్కడి రాజకీయ నాయకులను కలుస్తూ ఉన్నారు. అయితే కేఏ పాల్ ఒక రాజకీయ నాయకుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారట. ఇంతకు కేఏ పాల్ ఆ రాజకీయ నాయకున్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో తెలిస్తే మీరు కూడా అలర్ట్ అవుతారు. భారతీయ జనతా పార్టీకి(బీజేపీ) చెందిన ఒక సీనియర్ నాయకుడు నిత్యం కార్యక్రమాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. ఆయన పనులతో పాటు ఫోన్లో కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నారు.
అలాంటి ఒక సీనియర్ నేతకు కేఏ పాల్ రోజూ ఫోన్ చేస్తున్నారట. అయితే ఎవరు ఫోన్ చేసినా ఎత్తే ఆ సదరు నేత.. కేఏ పాల్ ఫోన్ మాత్రం ఎత్తటం లేదు.. ఎవరైనా తెలియని నెంబర్ నుంచి చేసిన ఎత్తి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంటారు సదరు నేత.. అంతేకాదు కేవలం మిస్టికాల్ చేసినా తిరిగి చేసే నైజం ఉన్న సదరు నాయకుడు కేఏ పాల్ ఫోన్ వస్తే మాత్రం ఎత్తకుండా ఉంటున్నారంట.
ట్రూ కాలర్లో కేఏ పాల్ పేరు పడుతుండడంతో ఆ ఫోన్ ఎత్తడానికి సదరు నేత జంకుతున్నారు. ఇటీవల తన సన్నిధిలో వద్ద కూడా కేఏ పాల్ నుంచి వరుస కాల్స్ చూయించి ఏమి చేయాలో అర్థం కావడం లేదంటూ తన బాధను వ్యక్తపరచుకున్నారు. ఎత్తితే ఒక బాధ ఎత్తకపోతే ఒక బాధ.. ఎత్తి ఏదైనా మాట్లాడితే మాట్లాడిన విషయం బయటకి చెప్తాడనే భయం. ఎత్తకపోతే ఫోన్ చేసినా ఎత్తట్లేదు ఎంత పొగరు.. అంటూ ప్రెస్ మీట్ లో అంటాడేమో అని సదరు నేత భయపడుతూ మిత్రుల ముందు వాపోయారట.
అయితే ఆ బాధ చెప్తున్న సమయంలో కొంతమంది సన్నిహితులు మీ ఒకరికే కాదు చాలామంది రాజకీయ నాయకులకు ఇదే ఇబ్బంది ఉందంటూ చెప్పడం తో ఆ నేత కొంత ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి కేఏ పాల్ దెబ్బకు సదరు నేత కాకుండా చాలామంది రాజకీయ నాయకులు ఫోన్ ఎత్తే మాట్లాడేందుకు భయపడుతున్నారని అర్థమవుతోంది. కేఏ పాల్ అంటే అట్ట ఉంటది మరీ..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
