
రాజకీయాల్లో బహిరంగచర్చ అనేది ఒక దేవతావస్త్రం లాంటిది. ఉన్నట్టే ఉంటుంది కానీ ఉండదు. బస్తీమే సవాల్ అని నేతాశ్రీలు తొడలుగొట్టడం, వేదికలు సిద్ధమవ్వడం, క్లయిమాక్స్‌లో పోలీసులొచ్చెయ్యడం, ఆ తర్వాత తూచ్ అనడం.. ఆల్ ఇన్ ది గేమ్. కానీ, సాగినంతసేపూ ఆ గేమ్ భలే రంజుగా ఉంటుంది. వాళ్లిచ్చే సౌండ్లతో కూడా మజా పుడుతుంది. తెలంగాణ పాలిటిక్స్‌లో అటువంటిదే ఒక రచ్చబండ సీను.. ఇప్పటికీ రాజుకుంటూనే ఉంది. 2026.. జూలై 2.. ఫైన్ మార్నింగ్.. పొలిటికల్ ఫైర్‌ఫైటింగ్. హైదరాబాద్‌లో నాలుగైదుగంటలపాటు హైడ్రామా. తెలంగాణ భవన్ వర్సెస్ గాంధీభవన్. జరుగుతున్నది మాత్రం గాడ్సేగిరీ. మాటలతోనే తూటాలు పేలుతున్నాయి. అప్పులు, అవినీతి, అభివృద్ధి.. సబ్జెక్ట్ ఏదైనా సరే బహిరంగచర్చకు మేం సిద్ధం, మీరు సిద్ధమా? ప్లేసూ, టైమూ నువ్వు చెబుతావా? నన్ను చెప్పమంటావా? నాంపల్లి నుంచి నడిరోడ్డుపైకి చేరాయి అసెంబ్లీ సీన్లు. ఖాళీకుర్చీలతో కారు పార్టీ, మందుపాతర లాంటి మాటలతో కాంగ్రెస్ పార్టీ.. డ్రామా మొత్తాన్ని మాంచి రసపట్టుమీద నడిపించారు, సవాళ్లు-ప్రతిసవాళ్లతో ధూమ్‌ధూమ్ ఆడేశారు. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్ ఎపిసోడ్లు ఎన్నయినా ఉండొచ్చు. ఇది మాత్రం అల్టిమేట్. ఒకేరోజు… రెండు అంశాలు. చర్చిద్దాం రమ్మని ఒకరు, చెప్పిన ప్లేసుకు వచ్చా.. నువ్వెక్కడ అని మరొకరు! అసెంబ్లీని వదిలేసి నడిరోడ్డు...