తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్స్‌ల విషయంలో సూర్యాపేట జిల్లాలోని రామాపురం చెక్‌పోస్టు అమలు చేసిన ఆంక్షలను సడలించారు. దీంతో కొద్దిసేపటి నుంచి ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను పోలీసులు అనుమతిస్తుండటంతో రోగుల బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి పాసులు లేకుండా కరోనా బాధితుల అంబులెన్స్‌లను అమతిస్తున్నారు. జోగులాంబ జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద కూడా ఏపీ అంబులెన్స్‌లకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ -పాస్ లేకున్నా హైదరాబాద్ వైపు వెళ్లేందుకు కరోనా రోగులతో వెళ్లే అంబులెన్స్‌లను అనుమతిస్తున్నారు.
హైదరాబాద్‌కు వస్తున్న అంబులెన్స్‌లను సరిహద్దుల్లో నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి వెంటక కృష్ణారావు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు వ్యవహరిస్తున్న తీరు పట్ల న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.