Telangana: గుజరాత్‌కు రూ.21 వేల కోట్లు, మరి తెలంగాణకేవి?.. కేంద్రంపై ఫైర్ అయిన వినోద్ కుమార్..

Telangana: తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష వైఖరిపై మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు.

Telangana: గుజరాత్‌కు రూ.21 వేల కోట్లు, మరి తెలంగాణకేవి?.. కేంద్రంపై ఫైర్ అయిన వినోద్ కుమార్..
B Vinod Kumar
Follow us

|

Updated on: Apr 21, 2022 | 7:53 PM

Telangana: తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష వైఖరిపై మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. గుజరాత్‌కు రూ. 21,969 వేల కోట్ల విలువ చేసే లోకో రైలు ప్రాజెక్టు పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారన్న ఆయన.. రైల్వే సంబంధిత ఉత్పత్తి కేంద్రాన్ని తెలంగాణలో ఎందుకు నెలకోల్పడం లేదు? అని ప్రశ్నించారు. కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేస్తారా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందన్నారు. కాజీపేటకు రైల్వే ప్రాజెక్టు ఎందుకు ఇవ్వరు? అని నిప్పులు చెరిగారు. రైల్వే ప్రాజెక్టు కోసం వరంగల్ ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘మోడీ గారు..! తెలంగాణ పట్ల ఇంత వివక్షత ఎందుకు?’’ అని నిలదీశారు వినోద్ కుమార్.

ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపైనే ప్రధాని మోదీ, బీజేపీ దృష్టి పెడుతున్నారని దుయ్యబట్టారు. వివక్షత విడనాడి, తెలంగాణ రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వినోద్ కుమార్. ఉత్తర, దక్షిణ భారతదేశ రోడ్డు, రైల్వే మార్గాలకు తెలంగాణ రాష్ట్రం ప్రధాన బిందువుగా ఉందని, ఇంతటి కీలక్ష జంక్షన్ అయిన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అయిన తెలంగాణలో రైల్వే పరంగా అనేక పనులు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నా, అన్ని రకాలుగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే పెద్ద పీట వేస్తోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

గుజరాత్ రాష్ట్రం దాహోద్ జిల్లాలో రూ. 21,969 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న రైల్వే లోకో మోటివ్ యూనిట్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న శంకుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు. వరంగల్ జిల్లాలోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇతర ఏదైనా రైల్వే సంబంధిత యూనిట్ ను ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ దారిలోనే బీజేపీ ప్రభుత్వం నడుస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆరు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే పరంగా పలు మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో ఏర్పాటు కావాల్సి ఉన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ను కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసి గుజరాత్ రాష్ట్రం జామ్ నగర్ కు తరలించిందని వినోద్ కుమార్ ఆరోపించారు.

రైల్వే పరంగా హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- నాగ్ పూర్ రూట్లలో ఇండస్ట్రియల్ కారిడార్, డిఫెన్స్ కారిడార్ లైన్లను మెరుగుపర్చడం లేదని, హైదరాబాద్‌లో ఫార్మా సిటీ, నేషనల్ డిజైన్ సెంటర్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లకు తగిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని వినోద్ కుమార్ ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత విడనాడి తక్షణమే రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయాలని, వివిధ పథకాలకు నిధులను విడుదల చేయాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

Also read:

TTD: శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పిన టీటీడీ.. ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు..

YSRCP Politics: సీఎం జగన్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా? ఆ జిల్లా రాజకీయాలు ఏ టర్న్ తీసుకోబోతున్నాయి..!

Kodanadu Case – VK Sasikala: కొడనాడు ఎస్టేట్ కేసులో శశికళను విచారించిన పోలీసులు.. చిన్నమ్మ రియాక్షన్ ఇదీ..!

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం
GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని
GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..