Revanth Reddy: మంత్రి కేటీఆర్‌ లీగల్ నోటీసులకు ఘాటుగా స్పందించిన రేవంత్‌రెడ్డి

తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అటు బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న టీఎస్‌పీఎస్పీ పేపర్‌ లీకేజీ, టెన్త్‌ క్లాస్‌ పేపర్‌ లీకేజీల వ్యవహారం తారాస్థాయికి..

Revanth Reddy: మంత్రి కేటీఆర్‌ లీగల్ నోటీసులకు ఘాటుగా స్పందించిన రేవంత్‌రెడ్డి
Revanth Reddy

Updated on: Apr 08, 2023 | 8:56 PM

తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అటు బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న టీఎస్‌పీఎస్పీ పేపర్‌ లీకేజీ, టెన్త్‌ క్లాస్‌ పేపర్‌ లీకేజీల వ్యవహారం తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇలా రోజులో అంశంపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు జోరందుకుంటున్నాయి. అయితే టీఎస్‌పీఎస్పీ, టెన్త్‌ క్లాస్‌ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంతో తెలంగాణ పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా.. కొన్నాళ్లుగా మంత్రి కేటీఆర్‌- టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మధ్య పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో కేటీఆర్‌తోపాటు ఆయన పీఏ హస్తముందనే ఆరోపణలతో ఆయన గరమయ్యారు. ఈ క్రమంలోనే.. గత నెల 28న రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ లీగల్ నోటీసులు పంపారు. టీఎస్‌పీఎస్సీ విషయంలో రేవంత్‌రెడ్డి.. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారంలోకి తరచూ తన పేరు లాగుతున్నారని లీగల్ నోటీసులు ఇచ్చారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని.. లేని పక్షంలో 100కోట్ల పరువు నష్టం దావా వేస్తానంటూ కేటీఆర్‌ నోటీసులు పంపారు.

లీగల్‌ నోటీసులకు ఏడు పేజీల సమాధానం

కేటీఆర్‌ లీగల్ నోటీసులు ఇచ్చి వారం రోజులు దాటడంతో రేవంత్‌రెడ్డి రియాక్ట్‌ అయ్యారు. కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు ఏడు పేజీల సమాధానం ఇచ్చారు. లీగల్‌ నోటీసులతోపాటు పలు అంశాలపై కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. లీగల్‌ నోటీస్‌లు వెనక్కి తీసుకోకపోతే.. క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని రేవంత్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందని.. ఆ ఉద్యమంతో కేటీఆర్‌కు సంబంధం లేదని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ విషయంలో నిరుద్యోగుల తరపున మాట్లాడానన్నారు. టీఎస్‌పీఎస్‌సీకి సాంకేతిక పరిజ్ఞానం ఐటీ శాఖేనని, అలాంటప్పుడు.. కేటీఆర్‌కు సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. నిందితుడు రాజశేఖర్‌ నియామకం కూడా ఐటీ శాఖ ద్వారానే జరిగిందని గుర్తు చేశారు. అంతేకాదు.. దమ్ముంటే పేపర్ లీక్ కేసును సీబీఐ, ఈడీకి అప్పగించాలని సవాల్ విసిరారు రేవంత్‌రెడ్డి.

మొత్తంగా.. లీగల్‌ నోటీసుల వ్యవహారంతో కేటీఆర్‌-రేవంత్‌రెడ్డి మధ్య పొలిటికల్‌ ఫైట్‌ నడుస్తోంది. అయితే.. నోటీసులు వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని రేవంత్‌ వార్నింగ్‌ ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి