Patnam Mahender Reddy: పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నారా..? ప్రగతి భవన్‌ నుంచి పిలుపుతో..

తెలంగాణలో రాజకీయాలో జోరందుకున్నాయి. వివిధ పార్టీల నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారన్న వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హీటెక్కిస్తున్నాయి. అయితే సొంత పార్టీల్లో టికెట్‌ దక్కకనో, పార్టీలో గుర్తింపు లేదనో ఇలా రకరకాల కారణాల వల్ల నేతలు ఇతర పార్టీల వైపు..

Patnam Mahender Reddy: పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నారా..? ప్రగతి భవన్‌ నుంచి పిలుపుతో..
Patnam Mahender Reddy

Updated on: Jun 27, 2023 | 8:35 PM

తెలంగాణలో రాజకీయాలో జోరందుకున్నాయి. వివిధ పార్టీల నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారన్న వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హీటెక్కిస్తున్నాయి. అయితే సొంత పార్టీల్లో టికెట్‌ దక్కకనో, పార్టీలో గుర్తింపు లేదనో ఇలా రకరకాల కారణాల వల్ల నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారన్న ఊహగానాలు జోరందుకున్నాయి. అయితే చివరి నిమిషంలో ఆయన తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఆయన అనుచరులు మాత్రం హస్తం పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మహేందర్‌రెడ్డిపై ఇలాంటి వార్తలు రావడంతో ఆయనకు ప్రగతి భవన్‌ నుంచి పిలుపు రావడంతో ఆయన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్‌ మొదటి సారి పాలనలో మంత్రిగా పని చేసిన పట్నం మహేందర్‌రెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ మహేందర్‌రెడ్డిని సీనియర్‌గా గుర్తుపెట్టుకుని ఎమ్మెల్సీని కట్టబెట్టింది. మహేందర్‌రెడ్డిపై కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పైలెట్‌ రోహిత్‌రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అయితే రానున్న ఎన్నికల్లో ఆయనకే టికెట్‌ ఇస్తారన్న ప్రచారం జోరందుకుంది.

ఇదే కనుక జరిగినట్లయితే మహేందర్‌రెడ్డికి టికెట్‌ రాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మహేందర్‌రెడ్డి పార్టీ మారేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మహేందర్‌రెడ్డితో పాటు తనకు మద్దతుగా ఉన్నమరి కొందరికి సీట్లు కేటాయింపుపై కాంగ్రెస్‌ నేతలతో చర్చించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి