
వరంగల్ జిల్లాలో వినూత్న పోలింగ్ కేంద్రం ఏర్పాటు
నర్సంపేట మండలం లక్నపల్లిలో హరిత పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన అధికారులు
కొబ్బరి మట్టలు, అరిటాకులతో పందిరి వేసిన అధికారులు
ఓటర్లను ఆకర్షించేదుకు అధికారులు సరికొత్త ప్రయత్నం
ఆహ్లాదకరమైన, వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
మహబూబ్‌నగర్ జిల్లాలో మూడో విడత ఎన్నికలు
మూడో విడతలో మొత్తం గ్రామపంచాయతీలకు 563
ఇప్పటికే 52 గ్రామాల్లో ఏకగ్రీవం
7 గ్రామాల్లో నిలిచి పోయిన ఎన్నికలు
మిగతా 504 గ్రామ పంచాయతీలకు కొనసాగుతున్న పోలింగ్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు ఓటర్లు.
తెలంగాణలో ఉదయం 9గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు
రంగారెడ్డి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 21.58 శాతం పోలింగ్ నమోదు
మంచిర్యా జిల్లాలో 9 గంటల వరకు 34 శాతం పోలింగ్
పెద్దపల్లి జిల్లా ఉదయం 9 గంటల వరకు 22.50 శాతం పోలింగ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 9 గంటల వరకు 26.11 శాతం పోలింగ్
కరీంనగర్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 20.66% పోలింగ్ నమోదు
ఆదిలాబాద్ జిల్లాలో తోమ్మిది గంటల వరకు19.37% నమోదు
నిర్మల్ జిల్లాలో 9 గంటల వరకు 29.98% నమోదు
మెదక్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 24.89 శాతం పోలింగ్
సంగారెడ్డి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 26.75శాతం పోలింగ్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 18.60 శాతం పోలింగ్
సిద్దిపేట జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 24.35 శాతం పోలింగ్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 29 శాతం పోలింగ్
ధర్మపురిలో ఉదయం 9గంటల వరకు నమోదైన పోలింగ్ 20.33%
వెల్గటూరులో ఉదయం 9గంటల వరకు 26% పోలింగ్ నమోదు
ఎండపల్లిలో ఉదయం 9 గంటల వరకు 22.1% పోలింగ్ నమోదు
గొల్లపల్లిలో ఉదయం 9 గంటల వరకు 26.44% పోలింగ్ నమోదు
బుగ్గారంలో ఉదయం 9 గంటల వరకు 20.26% పోలింగ్ నమోదు
పెగడపల్లిలో ఉదయం 9 గంటల వరకు19.19% పోలింగ్ నమోదు
వరంగల్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 22.26 శాతం పోలింగ్ నమోదు
జనగామ జిల్లాలో 9 గంటల వరకు 22.51% పోలింగ్ నమోదు
హనుమకొండ జిల్లాలో 9 గంటల వరకు 21.22 % పోలింగ్ నమోదు
ములుగు జిల్లాలో 9 గంటల వరకు 20.96 % పోలింగ్ నమోదు
మహబూబాబాద్ జిల్లాలో 9 గంటల వరకు 24.32% పోలింగ్ నమోదు
భూపాలపల్లి జిల్లాలో 9 గంటల వరకు 22.01 % పోలింగ్ నమోదు
మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లోని కిక్కిరిసిన పోలింగ్ కేంద్రాలు
ఓటు వేసేందుకు ఉత్సాహంగా తరలివస్తున్న యువకులు, వృద్దులు
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో కొనసాగుతున్న పోలింగ్
7 గంటల నుండే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు
అదిలాబాద్ జిల్లాలో ఆరు గ్రామాల్లో ఏకగ్రీవం
బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరేడిగోండ, గుడిహత్నూర్, తలమడుగు గ్రామాల్లో ఏకగ్రీవం
మిగిలిన 120 గ్రామ పంచాయతీలల్లో కొనసాగుతున్న పోలింగ్
పల్లెపోరు కోసం విదేశాల నుంచి వచ్చిన యువకుడు
ఓటు వేసేందుకు లండన్ నుంచి వచ్చిన విద్యార్థి
అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థి లవన్ కుమార్
కొనసాగుతున్న మూడో విడత ఎన్నికల పోలింగ్
రంగారెడ్డి గట్టుపల్లిలో పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్ల క్యూ
ఓటు హక్కు వినియోగించుకున్న 90 ఏళ్ల వృద్ధురాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 408 స్థానాలకు 22 ఏకగ్రీవం అయ్యాయి
దీంతో 386 స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ
కొనసాగుతున్న మూడోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
ఎలాంటి ఘటనలు జరగకుండా గ్రామాల్లో పోలీసుల బందోబస్తు
3,752 గ్రామాలు, 28,406 వార్డుల్లో పోలింగ్
సర్పంచ్ పదవులకు 12,640 మంది అభ్యర్థుల పోటీ
మహబూబ్‌నగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరగని గ్రామాలు
ఏడు గ్రామాల్లో జరగని పంచాయతీ ఎన్నికలు
అమ్రాబాద్ మండలంలోని నల్లమల్ల షెడ్యూల్ ప్రాంతంలో ఓటర్లు లేకున్నా ఎస్టీ రిజర్వేషన్
నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఏడు గ్రామాలు
తెలంగాణలో ప్రారంభమైన మూడో విడత పంచాయతీ ఎన్నికలు
మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతోంది
మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు అధికారులు
మొత్తం 182 మండలాల్లో పోలింగ్ జరగబోతుంది
3,752 గ్రామాలు, 28,406 వార్డుల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు
4,157 గ్రామాలు, 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 394 సర్పంచ్ స్థానాలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
11 గ్రామాలు, 112 వార్డులకు నామినేషన్‌లు దాఖలు కాలేదు
3752 సర్పంచ్ స్థానాలకు 12,640 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు
ఇప్పటికే రెండు దఫాల్లో ఎన్నికలు నిర్వహించగా ఇవాళ మూడో విడత పోలింగ్ జరుగుతుంది
ఇవాళ్టితో గ్రామపంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి.
పోలింగ్ జరిగే ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్ని పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకుంటున్నారు ఓటర్లు.. పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి త్వరగా స్వగ్రామాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు అధికారులు. ఇక ఇవాళ మూడో విడత పోలింగ్ జరుగుతుండగా.. నేటి గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి.
అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 182 మండలాల్లోని 3,752 గ్రామాలు, 28,406 వార్డుల్లో పోలింగ్ జరుగుతుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 4,157 గ్రామాలు, 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 394 సర్పంచ్ స్థానాలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 11 గ్రామాలు, 112 వార్డులకు నామినేషన్‌లు దాఖలు కాలేదు దీంతో 3,752 సర్పంచ్ స్థానాలకు 12,640 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
ఇక ఇప్పటికే రెండు దఫాల్లో ఎన్నికలు నిర్వహించగా ఇవాళ మూడో విడత పోలింగ్ జరుగుతుంది. ఇక ఇవాళ్టితో గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.