Omicron: తెలంగాణలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌ కేసులు.. కొత్తగా 12 కేసులు నమోదు.. మొత్తం ఎన్ని కేసులంటే..!

|

Dec 27, 2021 | 8:20 PM

Telangana Omicron: దేశంలో కరోనా మహహ్మారి నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇక భారత్‌లో..

Omicron: తెలంగాణలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌ కేసులు.. కొత్తగా 12 కేసులు నమోదు.. మొత్తం ఎన్ని కేసులంటే..!
ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 781కి చేరింది. మహారాష్ట్ర, ఢిల్లీలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో అత్యధికంగా 238 నమోదైతే.. మహారాష్ట్రలో 167కి చేరాయి. ఆ తర్వాత గుజరాత్‌లో 73, కేరళలో 65, తెలంగాణలో 62 కేసులు బయటపడ్దాయి.
Follow us on

Telangana Omicron: దేశంలో కరోనా మహహ్మారి నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇక భారత్‌లో క్రమ క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. సోమవారం కొత్తగా 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 56కు చేరింది.

కేసులు ఇంకా పూర్తిగా తగ్గిపోకముందు కొత్త వేరియంట్‌ వచ్చి ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను సైతం మరోసారి వణికిస్తోంది. భారత్‌లో ఈ ఒమిక్రాన్‌ వైరస్‌ రోజురోజుకు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి.

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడపుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. భారత్‌లో ఇప్పటివరకు 578 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించింది. దేశంలో 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. ఇప్పటివరకు 151 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఉన్నాయి. ఢిల్లీ అత్యధికంగా 142 కేసులు ఉండగా.. మహారాష్ట్రలో 141 కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Corona Positive: 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌.. అప్రమత్తమైన అధికారులు..!

Covid Vaccine: 15-18 ఏళ్ల టీనేజర్లకు గుడ్‌న్యూస్.. కోవిన్‌‌లో రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే..?