Telangana: అయ్యో‌తల్లీ ఎంత కష్టమొచ్చే.. శ్మశానంలో‌ నిండు గర్బిణీ నివాసం! చెత్తాచెదారమే ఆహారం..

ఆమె మానసిక‌ వికలాంగురాలు.. అందులోను నిండు గర్బిణీ. ఇంటి నుండి తప్పిపోయి.. దారి తెలియక, ఊరు తెలియక నట్టడివిలో ప్రయాణం సాగించింది. 60 కిలో మీటర్లు ప్రయాణించి ఉట్నూర్ కు చేరుకుంది. ఉండేందుకు చోటు కనిపించక ఎక్కడ నివాసం ఉండాలో తెలియక ఆ బోలాశంకరుడు నివాసం ఉండే స్మశానాన్నే ఎంచుకుంది. పక్కనే డంపింగ్ యార్డ్ లోని చెత్తా చెదారాన్ని తింటూ మూడు రోజులుగా జీవనం సాగించింది. స్థానిక పారిశుధ్య కార్మికుల కంట పడటంతో ఆరా తీస్తే చిరు నవ్వుతోనే సమాధానం ఇచ్చింది. మానసిక వికలాంగురాలు కావడంతో ఊరు..

Telangana: అయ్యో‌తల్లీ ఎంత కష్టమొచ్చే.. శ్మశానంలో‌ నిండు గర్బిణీ నివాసం! చెత్తాచెదారమే ఆహారం..
Pregnant Woman Resides In Graveyard

Edited By:

Updated on: Aug 23, 2023 | 9:14 AM

ఆదిలాబాద్, ఆగస్టు 23: ఆమె మానసిక‌ వికలాంగురాలు.. అందులోను నిండు గర్బిణీ. ఇంటి నుండి తప్పిపోయి.. దారి తెలియక, ఊరు తెలియక నట్టడివిలో ప్రయాణం సాగించింది. 60 కిలో మీటర్లు ప్రయాణించి ఉట్నూర్ కు చేరుకుంది. ఉండేందుకు చోటు కనిపించక ఎక్కడ నివాసం ఉండాలో తెలియక ఆ బోలాశంకరుడు నివాసం ఉండే స్మశానాన్నే ఎంచుకుంది. పక్కనే డంపింగ్ యార్డ్ లోని చెత్తా చెదారాన్ని తింటూ మూడు రోజులుగా జీవనం సాగించింది. స్థానిక పారిశుధ్య కార్మికుల కంట పడటంతో ఆరా తీస్తే చిరు నవ్వుతోనే సమాధానం ఇచ్చింది. మానసిక వికలాంగురాలు కావడంతో ఊరు పేరు చెప్పే పరిస్థితి లేకపోవడంతో స్థానికులకు సమాచారం ఇచ్చార పారిశుద్ధ కార్మికులు. ఘటన స్థలికి చేరుకున్న స్థానికులు పోలీసుల సహకారంతో అమ్మాయిలను స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆ నిండు గర్భిణీ ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు

కొమురం భీం జిల్లా కెరమెరి మండలం చిన్నుగూడ (హట్టి)కి చెందిన నిండు గర్బిని.. మానసిక వైకల్యంతో ఇంటి నుండి తప్పిపోయింది. అలా 60 కిలో మీటర్ల కాలినడకన దట్టమైన అడవిలో ప్రయాణించి ఉట్నూర్ కు చేరుకుంది. అలా ప్రయాణించిన రాజు భాయ్ ఉట్నూరులోని హిందూ స్మశాన వాటికకు చేరింది. అక్కడే పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ లోని కుళ్ళిన ఆరపదార్థాలను తింటూ మూడు రోజులుగా జీవనం సాగించింది. హిందూ స్మశాన వాటికలో సేద తీరుతున్న మహిళను గుర్తించిన పారిశుద్ధ కార్మికులు ఆ మహిళ నిండు గర్భిణిగా తెలియడంతో స్థానికులకు సమాచారం ఇచ్చారు.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం ఆ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యుల సహకారంతో ఆ మహిళకు ప్రధమ చికిత్స అందించి ఆ వెంటనే స్థానికుల సాయంతో స్నానం చేయించి ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఆరా తీయడంతో ఆ గర్బినిది కొమురంభీం జిల్లా కెరమెరి మండలం హట్టి గ్రామం అని తెలియడంతో షీటీమ్ బృందం సహకారంతో ఆ గర్బినిని ప్రత్యేక వాహనం లో సురక్షితంగా సొంతూరుకు చేర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.