Telangana: అద్భుతం.. యాదాద్రీశుడికి అగ్గిపెట్టలో బంగారు పట్టుచీర.. ఔరా అనాల్సిందే

చేనేత కళాకారుల కాణాచి తెలంగాణ రాష్ట్రం. ఒకనాటి వైభవంగా మిగిలిపోయిన అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరలను తయారీనీ చేనేత కార్మికుల వారసులు మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. తాజాగా భక్తుల కోరికలను తీర్చే మహిమాన్విత స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహుడి సన్నిధిలోని అమ్మ వారికి అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు చీరను కానుకగా సమర్పించారు.

Telangana: అద్భుతం.. యాదాద్రీశుడికి అగ్గిపెట్టలో బంగారు పట్టుచీర.. ఔరా అనాల్సిందే
Telangana Matchbox Saree

Edited By:

Updated on: Dec 18, 2025 | 10:31 AM

తెలంగాణ చేనేత కళాకారులు ఎన్నో అద్భుతాలను సృష్టించారు. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరలను తయారీలో మన చేనేతకారులు విశ్వఖ్యాతి పొందారు. ఈ అద్భుత ప్రతిపని తమ పూర్వీకుల వారసత్వాన్ని నేటి చేనేత కార్మికులు కొనసాగిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేతకారుడు నల్ల విజయ్ కుమార్ తన తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని కొన్నేళ్లుగా అగ్గిపెట్టెలో అమర్చగలిగే పట్టుచీరలను నేస్తున్నారు.

అయితే తాజాగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న ఆయన ఆలయంలో ఏఈవో రఘు, ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులకు బంగారు చీరను అందజేశారు. అనంతరం విజయ్ కుమార్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అద్భుత కళాఖండాన్ని సృష్టించేందుకు చేనేత కళాకారుడు విజయ్ కుమార్ రెండు గ్రాముల బంగారాన్ని వినియోగించారు.

ఈ బంగారు పట్టు చీరను 5.30 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పులో ఉంది.వారంరోజుల పాటు శ్రమించి ఈ చీరను అగ్గిపెట్టెలో ఇమిడేలా తయారుచేసినట్టు విజయ్‌ తెలిపారు. ఇలాంటి అద్భుత కళాఖండాలను ప్రముఖ ఆలయాలకు కానుకగా అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.