Nalgonda: ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి.. రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు నాయక్ ఏసీబీకి చిక్కారు. శుక్రవారం ఉదయం రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. ఔషదాల టెండర్‌ నిమిత్తం డాక్టర్ లచ్చు నాయక్ రూ.3లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

Nalgonda: ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి.. రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ
Superintendent Lachu

Updated on: Feb 16, 2024 | 1:22 PM

ఫిబ్రవరి 16: నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఫిబ్రవరి 16న శుక్రవారం పట్టుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి సూపరింటెండెంట్ డాక్టర్ లావుడ్య లచ్చు నల్గొండలోని తన నివాసంలో మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న (ఫిర్యాదుదారు) నుంచి లంచం తీసుకుంటుండగా  ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి త్వరలో ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రికి 2 సంవత్సరాలుగా మెడిసిన్ సరఫరా చేస్తున్నట్లు వెంకన్న వెల్లడించారు. కొన్నాళ్లుగా సూపరింటెండెంట్‌ 10 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారని, ఇటీవల ఎక్కువ కావాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపాడు. నెలరోజుల క్రితం రూ.లక్ష లంచంగా ఇవ్వగా.. నాలుగు రోజుల క్రితం మరో రూ. 3 లక్షలు డిమాండ్‌ చేయడంతో ACB ఆశ్రయించినట్లు వివరించాడు.

ఈ వారం ప్రారంభంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ మండలానికి చెందిన తహశీల్దార్ రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట తహశీల్దార్‌ తోడేటి సత్యనారాయణ అవినీతి శాఖ అధికారులకు పట్టుబడ్డాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.