
తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ కూడా పలు మున్సిపాలిటీ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో గట్టి పోటీ ఇస్తోంది. పలు ప్రాంతాల్లో బీజేపీ కూడా ముందంజలో కొనసాగుతోంది..
అయితే.. మొదటి ఫలితం రానే వచ్చింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బోణి కొట్టింది. గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.. 14 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపొందగా.. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
ఇంకా కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీ ముందంజలో ఉన్నాయి..
నందికొండ, హాలియా, చండూరు మునిసిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
తెలంగాణ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం..
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది.
కాంగ్రెస్ – 145
బీఆర్ఎస్ -71
బీజేపీ – 17
ఇతరులు – 15
కాంగ్రెస్ – 2
బీఆర్ఎస్ – 0
బీజేపీ – 0
ఇతరులు – 0