Telangana: దేశానికే ఆదర్శంగా తెలంగాణ పురపాలక సంస్థలు.. పట్టణ ప్రగతితో 142 పురపాలికల్లో మౌలిక వసతులు..

|

Mar 22, 2023 | 5:59 AM

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణహిత, అభివృద్ధి పనులతో రాష్ట్రంలో పురపాలక సంస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. పట్టణ ప్రగతితో 142 పురపాలికల్లో మౌలిక వసతులు కల్పించారు. పట్టణాభివృద్ధి పనుల నిధుల కేటాయింపులు, విడుదలలోనూ తెలంగాణ ముందుంది.

Telangana: దేశానికే ఆదర్శంగా తెలంగాణ పురపాలక సంస్థలు.. పట్టణ ప్రగతితో 142 పురపాలికల్లో మౌలిక వసతులు..
Hmda
Follow us on

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణహిత, అభివృద్ధి పనులతో రాష్ట్రంలో పురపాలక సంస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. పట్టణ ప్రగతితో 142 పురపాలికల్లో మౌలిక వసతులు కల్పించారు. పట్టణాభివృద్ధి పనుల నిధుల కేటాయింపులు, విడుదలలోనూ తెలంగాణ ముందుంది. పర్యావరణ పరిరక్షణ, శానిటేషన్ పైన పురపాలక సంస్థలు ప్రత్యేక శ్రద్ద చూపుతున్నాయి. జీహెచ్ఎంసి మినహా 141 పురపాలక సంస్థల్లో ప్రతిరోజూ 4,356 టన్నుల చెత్తను సేకరీస్తున్నారు. ఇంటింటికి తిరిగి 100% చెత్తను సేకరిస్తున్నారు. తరలింపు కోసం కొత్తగా 2165 పారిశుధ్య వాహనాలు కొనుగోలు చేయడంతో శుభ్రత మరింత మెరుగుపడింది.

సేకరించిన చెత్తను ప్రాసెస్ చేయడానికి 1233 ఎకరాల విస్తీర్ణంలో డంప్ యార్డులను ఏర్పాటు చేశారు. తడి, పొడి చెత్తను విడదీయడానికి 206 డ్రై సోర్స్ కలెక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చేందుకు 229 కంపోస్టు బెడ్స్ ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీహెచ్ఎంసీ మినహా ఇతర చోట్ల 428 కోట్ల రూపాయలతో రోజుకు 2035 కిలో లీటర్ల సామర్ధ్యం కలిగిన 139 మల వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

పచ్చదనాన్ని పెంపొందించటానికి గ్రీన్ యాక్షన్ ప్లాన్ ను పురపాలక సంస్థల్లో పటిష్టంగా అమలు చేస్తోంది ప్రభుత్వం. 2021 నుంచి ఇప్పటి వరకూ 34.59 లక్షల మొక్కలను నాటారు. తెలంగాణకు హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..