MLC Pochampally Srinivas Reddy: చెక్కు చెదరని పోచంపల్లి రికార్డు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి చరిత్ర సృష్టించారు..!

|

Dec 17, 2021 | 6:17 PM

MLC Pochampally Srinivas Reddy: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రికార్డు చెక్కు చెదరలేదు. 98 శాతం ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

MLC Pochampally Srinivas Reddy: చెక్కు చెదరని పోచంపల్లి రికార్డు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి చరిత్ర సృష్టించారు..!
Mlc Pochampally Srinivas Re
Follow us on

MLC Pochampally Srinivas Reddy: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రికార్డు చెక్కు చెదరలేదు. 98 శాతం ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అప్పట్లో చరిత్ర సృష్టించారు. ఆ చరిత్రను ఇప్పుడు అలాగే నిలబెట్టుకున్నారాయన. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 2019 జూన్ 3న ఉప ఎన్నిక జరిగింది. మొత్తం ఓటర్లు 902 మంది ఉండగా 883 మంది ఓటు వినియోగించుకున్నారు. వీరిలోనూ వాటిలో 848 మంది తమ ఓటును పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి వేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు పడటం దేశంలోనే లేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 23 ఓట్లు పోలవగా.. 12 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. అయితే, ఈ సారి 12 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు వచ్చాయి. వీటిలో ఆరు స్థానాలు ఏకగ్రీవం కాగా మరో ఆరింటికి ఎన్నికలు నిర్వహించారు. వీటి ఫలితాలు కూడా వెలువడ్డాయి.

ఈ ఫలితాల్లో 89 శాతం ఓట్లతో ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ విజయం ఘన విజయం సాధించారు. ఇంతటి ఘన విజయం సాధించినప్పటికీ.. పోచంపల్లి దరిదాపుల్లోకి ఎవరూ రాలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పోచంపల్లి శ్రీనివాస రెడ్డి వివాద రహితుడుగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఆయనకు వరికోలు శ్రీమంతుడిగా పేరుంది. ఇప్పుడు మిగతా పార్టీలకు కొంత బలం ఉన్నా పోచంపల్లి శ్రీనివాస రెడ్డి మాత్రం ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం అనే చెప్పాలి. ఆయనకు ప్రత్యర్థులుగా నామినేషన్ వేసిన వాళ్ళు కూడా తమ నామినేషన్లను చివరకు ఉపసంహరించుకున్నారు. ఇలా ఒకసారి రికార్డు స్థాయి ఓట్లతో.. ఇప్పుడు ఏకగ్రీవంతో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. తనకంటూ ప్రత్యేక హిస్టరీని క్రియేట్ చేసుకున్నారంటూ టీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.

Also read:

Bheemla Nayak: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ చిత్ర యూనిట్.. పవన్ కోసం సందడి చేస్తున్న ఫ్యాన్స్

PM Modi: ప్రధాని మోడీకి అరుదైన గౌరవం.. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక

Bigg Boss 5 Telugu: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్.. హౌస్ నుంచి సిరి ఎలిమినేట్.. గేట్ దగ్గరే కుప్పకూలిన షణ్ముఖ్..