MLC Elections Results 2021: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు.. పెద్దల పోరులో టీఆర్‌ఎస్‌‌దే హవా..

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ మరోసారి చరిత్ర సృష్టించింది.

MLC Elections Results 2021: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు.. పెద్దల పోరులో టీఆర్‌ఎస్‌‌దే హవా..
Trs

Edited By:

Updated on: Dec 14, 2021 | 11:30 AM

TS MLC TRS Victory: తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఏ ఎన్నికలైనా తిరుగులేదనిపించింది. ఇవాళ వెలువడిన ఫలితాల్లో ఆరు సీట్లలోనూ గులాబీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ నెల10వ తేదీన నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు ఇవాళ చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఐదుచోట్ల ఓట్ల లెక్కింపు నిర్వహించారు. కరీంనగర్‌లో ఎల్‌.రమణ, భానుప్రసాద రావు విజయం సాధించారు. ఖమ్మంలో తాతా మధు, నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి గెలుపొందారు. మెదకలో ఓటేరు యావదరెడ్డి, ఆదిలాబాద్‌లో దండే విఠల్‌ విజయం సాధించారు.

Read Also… PM Modi Kashi Tour: కాశీలో మోదీ పూజల సీక్రెట్ ఏంటి..? కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించిన మోడీ.. (వీడియో)