
నంది అవార్డుల ప్రధానోత్సవంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను ఇవ్వడం లేదని కొందరు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తనదైన శైలిలో స్పందించారు. నంది అవార్డులు ఇవ్వమని సినీ పరిశ్రమ తరఫున ఎవ్వరూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలేదన్న మంత్రి ఎవరు పడితే వాళ్లు అడితే నంది అవార్డులు ఇవ్వరని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది తెలంగాణ ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే నంది అవార్డులపై వివాదానికి కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్‌కి సంబంధించి బీజం పడింది. రీరిలీజ్ చేయనున్న నేపథ్యంలో నిర్వహించిన విలేకరల సమావేశంలో నంది అవార్డుల విషయమై పలువురు నిర్మాతలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇవ్వాలన్న ఆసక్తి రెండు ప్రభుత్వాలకూ లేదని చేసిన వ్యాఖ్యలపై తలసాని పరోక్షంగా స్పందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..