Sabitha : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే: మంత్రి సబిత

భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ..

Sabitha : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే:  మంత్రి సబిత
Sabitha Indra Reddy

Updated on: Jul 07, 2021 | 10:25 PM

Sabitha Indara Reddy Visit : భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానిదేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో విద్యాశాఖ మంత్రి బుధవారం పర్యటించారు. గడిసింగాపూర్, రాఘవాపూర్, రంగంపల్లి, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలను ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, కలెక్టర్ పౌసుమిబసు, జడ్పీ చైర్మన్ సునీత రెడ్డి లతో కలిసి మంత్రి ప్రారంభించారు.

7 వ విడత హరితాహారంలో భాగంగా ఇంబ్రహీంపూర్ గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో మంత్రి సబిత మొక్కలు నాటారు. దేశంలో ఎక్కడలేని విధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు. రైతులను ఏకీకృతం చేసి వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసేందుకు రైతు వేదికలు దోహదపడతాయని అన్నారు.

పల్లెలు పట్టణాలకు దీటుగా ఉండాలనే ఉద్దేశ్యం తో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి సబిత తెలిపారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు వచ్చే నెల నుంచి ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మంత్రి వెల్లడించారు.

Read also: Jithender Reddy: తప్పుడు ఆరోపణలతో ఈటల రాజేందర్‌ను బయటికి పంపించారు : జితేందర్ రెడ్డి