సినీ, రాజకీయ నేతల పుత్రరత్నాలు.. తల్లిదండ్రులు నడిచిన రూట్‌లోనే వెళ్తుంటారు. సినిమాల్లో నటిస్తుంటారు.. రాజకీయాల్లో ఎదుగుతుంటారు. మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్ష్‌లో మాత్రం డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి. సంగీతమంటే ఇష్టపడే హిమాన్ష్ తొలిసారి ఓ ఇంగ్లీష్ పాటకి కవర్ సాంగ్ పాడాడు. హాలీవుడ్ పాప్ స్టార్ JVKE పాడిన గోల్డెన్ అవర్ సాంగ్ తీసుకొని హిమాన్షు తన గొంతుతో మ్యాజిక్ చేశాడు. అచ్చం జాకబ్ లాసన్‌ను తలపించేలా అతను ఈ కవర్ సాంగ్ పాడాడు. సాంగ్ ఎంతో అద్భుతంగా ఉందంటున్నారు నెటిజన్స్.
ఈ పాటను విన్నవారంతా హిమాన్ష్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లీష్ సాంగ్‌తో హిమాన్షు దుమ్ము రేపుతున్నాడంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం తన యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేసిన ఈ సాంగ్ వైరల్ గా మారింది. హిమాన్షుకు మంచి సింగర్ అయ్యే లక్షణాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. తనయుడి సాంగ్‌తో తండ్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. కొడుకును చూస్తుంటే గర్వంగా ఉందన్నాడు. అందరికీ నచ్చాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. థ్యాంక్యూ డాడీ అంటూ తండ్రి ట్వీట్‌కు హిమాన్షు రావు రిప్లై ఇచ్చారు. అటు ఎమ్మెల్సీ కవిత కూడా అల్లుడి సాంగ్‌కి ముచ్చటపడ్డారు. ఎంతో అందంగా బాగా పాడాడంటూ ప్రశంసించారు.
ప్రస్తుతం హిమాన్షు రావు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నాడు. సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక, సృజనాత్మక అంశాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు హిమాన్ష్ రావు. తన స్కూల్‌లో ఇటీవలే నిర్వహించిన కాస్నివాల్‌కు ఇంఛార్జ్‌గా వ్యవహరించారు. దాని ద్వారా వచ్చిన ఆదాయంతో ఖాజాగూడ కొత్తచెరువును అభివృద్ధి చేస్తామన్నారు. హిమాన్షుకు మంచి సింగర్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. మరి తనయుడ్ని కేటీఆర్ మంచి సింగర్ చేస్తారా చూడాలి. పాటకు మాత్రం తెగ లైక్‌లు వచ్చి పడుతున్నాయి. ఇంగ్లీష్ సాంగ్ ను వెస్ట్రన్ యాక్సెంట్‌లో ఉచ్ఛరించిన ఈ పాట వింటుంటే.. ప్రొఫెసనల్ సింగర్స్ పాటినట్టే ఉంది కదా.. అంటున్నారు నెటిజన్స్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..